పుష్ప-2ని మా 40 ఊళ్లలో ఎలా రిలీజౌతుందో చూస్తా : అల్లు అర్జున్‌కి జనసేన నేత ఛాలెంజ్

మూడేళ్ల క్రితం అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా పుష్ప పార్ట్ 1 యావత్ భారతదేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. 1980వ దశకంలో శేషాచంల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఆధిపత్య పోరును ఇతివృత్తంగా తీసుకుని పీరియాడికల్ మూవీగా పుష్పను తెరకెక్కించారు సుకుమార్. ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలాగే అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో స్థానం సంపాదించి తెలుగు సినిమా సత్తాను నిరూపించింది.

ఈ సినిమాలోని డైలాగులను రాజకీయ నాయకులు కూడా ప్రస్తావించారంటే దేశాన్ని పుష్ప ఎలా ఊపేసిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప-2 కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న పుష్ప-2ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గతంలోనే ప్రకటించింది. కానీ అనూహ్యంగా పుష్ప-2 విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ సంచలన ప్రకటన చేయడంతో బన్నీ ఫ్యాన్స్ షాకయ్యారు.

janasena leader chalamalasetty ramesh babu fires on icon star allu arjun over pushpa-2 release here s the details

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీని డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపింది. మెగా ఫ్యాన్స్‌కు భయపడే పుష్ప-2 రిలీజ్‌ను వాయిదా వేసినట్లుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్‌ల మధ్య కూడా విభేదాలు చోటు చేసుకున్నాయని కూడా వార్తలు వచ్చాయి. కానీ పుష్ప ది రూల్ వాయిదా పడటానికి అసలు కారణాలేంటీ అనేది మాత్రం బయటకు రాలేదు.

డిసెంబర్ ఆరునైనా సినిమా రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు కొన్ని వర్గాల్లో నెలకొన్నాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ డిసెంబర్ 6న పుష్ప-2ని రిలీజ్ చేస్తామని మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. విట్ నెస్ హిజ్ రూల్ ఇన్ 100 డేస్ అని దానికి క్యాప్షన్ ఇచ్చారు. అయితే పుష్ప-2ని మా ఏరియాలో ఎలా రిలీజ్ చేస్తావో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు. మెగా ఫ్యామిలీ పట్ల అల్లు అర్జున్ తీరు సరికాదంటూ ఆయన భగ్గుమన్నారు.

చిరు, పవన్, నాగబాబు అండ చూసుకుని నువ్వు సినిమాల్లోకి వచ్చావంటూ చలమలశెట్టి ఎద్దేవా చేశారు. వాళ్ల ముగ్గురి కాళ్లు కడిగి పబ్లిక్‌గా మీడియా ముందు నెత్తిన చల్లుకోకుంటే నీ పుష్ప-2 సినిమా గన్నవరం నియోజకవర్గంలోని 40 గ్రామాల్లో ఎలా రిలీజ్ చేస్తావో చూస్తానంటూ హెచ్చరించారు. అసలు అల్లు అర్జున్‌కు ఫ్లెక్సీలు కట్టేవాళ్లు కూడా తమ నియోజకవర్గంలో లేరంటూ ఆయన చురకలంటించారు. ప్రస్తుతం చలమలశెట్టి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బన్నీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. ఇప్పుడు రమేష్ బాబు దానికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X