‘రోజా ఆడదా? మగదా? జగన్ ఆమె కొడుకేనా?’
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. నేతలు ఒకరిపై మరొకరు అభ్యంతరకరంగా, అసభ్యపదజాలంతో దూషించుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేతల మధ్య బూతుల యుద్ధం జరిగింది. ఏకంగా అసెంబ్లీలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరమైన భాషను ఉపయోగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇలాంటి వాతావరణం కాస్త తగ్గింది.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి అసభ్య వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలతో పాటు అరెస్ట్‌ల పర్వం నడుస్తోంది. దీనిపై విపక్ష వైసీపీ నేతలు, కేడర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వేమిరెడ్డికి ప్రశాంతి రెడ్డికి బదులు తానే ఓ కన్నెపిల్లను తెచ్చి పెళ్లి చేసేవాడినని, ప్రశాంతి చరిత్ర మొత్తం తనకు తెలుసునంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు.. నల్లపరెడ్డి ఇంటిపై దాడి చేయడం, ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి ఘటనలు జరిగాయి.

వడ్డీతో సహా చెల్లిస్తాం
ఈ ఇష్యూలో ప్రశాంతి రెడ్డికి మద్ధతుగా టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ నిలబడింది. మహిళా కమీషన్ సైతం ఆయనపై సీరియస్ అవ్వడంతో ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై వైసీపీ నుంచి కూడా గట్టిగానే ఎదురుదాడికి దిగుతోంది. ఇకపోతే.. దూకుడు రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచే వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా గత కొద్దిరోజులుగా యాక్టీవ్‌గా ఉంటున్నారు. కూటమి నేతలపై మండిపడుతున్నారు. తాజాగా నగరిలో జరిగిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చేతిలో అధికారం ఉంది కదా అని కూటమి నేతలు ఇష్టం వచ్చినట్లుగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి, దాడులు చేస్తే తాము 100 రెట్ల వడ్డీతో సహా బదులు చెల్లిస్తామని రోజా వార్నింగ్ ఇచ్చారు.
గాలి నా***లు ఎక్కువయ్యారు
గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారని.. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాల్సిందేనని దుయ్యబట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి పిచ్చి బాగా ముదిరిందని ఎక్కడికి వెళితే.. అక్కడే పుట్టానని అంటాడని రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు వీకెండ్ నాయకులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గాలి నా కొడుకులు ఎక్కువయ్యారని.. ఒక్కరంటే ఒక్కరు కూడా రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ల సమస్యల్ని కనుక్కోవడం లేదని రోజా మండిపడ్డారు.
రోజాకు బొలిశెట్టి కౌంటర్
రోజా వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆమెకు కౌంటరిచ్చారు. 'మనం సైలెంట్‌గా ఉంటే ఈ రఫ్పా రఫ్పా గాళ్లంతా రోడ్లెక్కి మాట్లాడుతుంటే మనమంతా ఎక్కడ ఉన్నామో అర్ధం కావడం లేదు. ఎమ్మెల్యే నా కొడుకులట.. రోజా మాట్లాడుతుంది.. ఆమె అసలు ఆడదో, మగదో ఎవడికీ తెలియదు. ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా దాని కొడుకేనా?. ఎమ్మెల్యే అంటే జగన్, చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలే కదా. నా వయసెంత రోజా వయసెంత.. ఇలాంటి దురదృష్టకరమైన బూతులు. కొంతమంది కాపుల్ని ఉసిగొలిపి వాళ్లతోనే స్టేట్‌మెంట్స్. అంబటి రాంబాబు, పేర్ని నాని.. పనికిమాలినోళ్లంతా వచ్చి దమ్ముంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు' అని బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు.
జగన్ పెద్ద గజదొంగ
'వీళ్లంతా ఆడవాళ్లని తిట్టి.. చంద్రబాబు గారిని తిట్టి, కన్నాలేసి ఇవాళ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని చెబుతున్నారు. ఒక్కోక్కరి వెనుక వేల కోట్ల రూపాయల కుంభకోణాలు ఉన్నాయి. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు.. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. వీళ్లంతా మామూలు దొంగలైతే జగన్ గజదొంగ.. లిక్కర్, గనులు, ఇసుక చివరికి అడవి నుంచి వచ్చే డబ్బు కూడా దోచుకున్నారు. ఇంటింటికి ఖాతాలు పెట్టి డబ్బులు వసూలు చేసిన కొట్టు సత్యనారాయణ కూడా మాట్లాడుతున్నాడు. త్వరలో కొట్టు సత్యనారాయణ బాధితుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం' అని బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











