జానీ మాస్టర్‌పై జనసేన వేటు!.. లైంగిక దాడి కేసుతో పార్టీకి దూరంగా పెట్టిన అగ్రనాయకత్వం!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తన డ్యాన్స్ అసిస్టెంట్ తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపుతున్నది. తనపై దారుణంగా లైంగిక దాడులు చేశాడు. కోరిక తీర్చాలని శారీరక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు నమోదు నేపథ్యంలో జానీ మాస్టర్ వ్యవహారంపై జనసేన తీవ్రంగా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినీ పరిశ్రమలో జానీ మాస్టర్ టాప్ కోరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. అయితే తనపై దారుణంగా అరాచకాలకు పాల్పడ్డారనే ఆరోపణల చేస్తూ జానీ మాస్టర్‌పై అసిస్టెంట్, బాధితురాలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు నార్సింగి పరిధిలోకి వస్తుండటంతో కేసును అక్కడికి ట్రాన్స్ ఫర్ చేశారు.

ఇదిలా ఉండగా, జానీ మాస్టర్ కొద్దికాలంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. సామాజీక సేవలు చేస్తూ ప్రజలతో మమేకం అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై తీవ్ర లైంగిక ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ తీవ్రంగానే స్పందించింది. ఆయనపై చర్యలు తీసుకొంటూ పార్టీకి దూరంగా ఉండాలని కోరింది.
జానీ మాస్టర్‌పై వేటు వేస్తూ.. జనసేన పార్టీ అధికారిక ప్రకటనను జారీ చేసింది. ఈ ప్రకటనలో.. జనసేన పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ షేక్ జానీనీ ఆదేశించడం జరిగింది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది అని పార్టీ కాన్‌ఫ్లీక్ట్ మేనేజ్‌మెంట్, అధినేత అజయ్ కుమార్ వేములపాటి ప్రకటనలో తెలిపారు.
దాంతో ఈ కేసు విషయంలో తుది విచారణ, తీర్పు వెలువడే వరకు జానీ మాస్టర్‌సై వేట కొనసాగుతుంది. ఆయనపై శిక్ష అమలు జరిగితే.. లేదా ఈ కేసులో ఎలాంటి శిక్ష విధిస్తే.. పార్టీ నుంచి బహిష్కరించేలా నిర్ణయం తీసుకోనే దిశగా అడుగులేస్తున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్‌పై కేసు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో సంచలన రేపుతున్నది.


Click it and Unblock the Notifications











