Devara: ఎన్టీఆర్ మూవీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్ల వల్లే ఈవెంట్ క్యాన్సిల్ అంటూ!

ఎన్టీఆర్ మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్ పరంగా మెప్పించడంతో పాటు ఎన్నో రంగాల్లో సత్తా చాటుతూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇలా ఎంతో కాలంగా టాలీవుడ్‌లో తనదైన ప్రభావాన్ని చూపించిన అతడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గానూ మారిపోయాడు. దీంతో భారీ రేంజ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పుడు 'దేవర' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే కే తారక రామారావు కామెంట్లు చేశారు. ఆ వివరాలను మీరే చూడండి!

జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమాలో నటించాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్‌తో రాబోతోంది. దీంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే ఈ మూవీని భారీగానే తీశారు. మొత్తం రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్టును సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు.

K T Rama Rao Comments On Jr NTR Starrer Devara Movie Pre Release Event Cancelled

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను సైతం చిత్ర యూనిట్ ఇప్పటికే చాలా వరకూ కంప్లీట్ చేసుకుంది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. దీనిపై చిత్ర బృందం కూడా అధికారిక ప్రకటన చేసింది.

హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరగాల్సిన 'దేవర' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. అక్కడకు అనుమతి ఉన్న దానికంటే ఎక్కువగా అభిమానులు చేరుకోవడం వల్లే నిర్వహకులు దీన్ని రద్దు చేశారు. దీంతో ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై కేటీఆర్ స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు.

కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు శ్రమించాం. కానీ, ఇప్పుడా పరిస్థితులు లేవు. మేము సినిమా ఈవెంట్లు కూడా సక్సెస్ చేశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. పాపం జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా ఈవెంట్ పెట్టుకుంటే దాన్ని కూడా నిర్వహించలేని అసమర్థత ఈ ప్రభుత్వానిది' అంటూ చెప్పుకొచ్చారు.

K T Rama Rao Comments On Jr NTR Starrer Devara Movie Pre Release Event Cancelled

ఇదిలా ఉండగా.. 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: devara jr ntr k t rama rao
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X