కాదంబరీ జత్వానీ కేసు.. ఆ ఐపీఎస్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు .. తెరపైకి మరో కొత్త కేసు
గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సినీనటి కాదంబరీ జత్వానీ కేసు తెరపైకి రావడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తనను, తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హింసించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇది అటు తిరిగి ఇటు తిరిగి ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్స్‌కు దారి తీసింది. తాజాగా ఈ కేసులో ఓ సీనియర్ ఐపీఎస్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ముంబైకి చెందిన హిందీ సినీనటి కాదంబరీ జత్వానీని కృష్ణాజిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ కుక్కల నాగేశ్వరరావు తనయుడు విద్యాసాగర్ తనను ప్రేమతో పేరుతో మోసం చేసినట్లుగా ఆరోపించింది. ప్రభుత్వ పెద్దల సాయంతో తనను వదిలించుకోవడానికి విద్యాసాగర్ కుట్ర చేశాడని కాదంబరీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు తెర వెనుక ఉండి, పోలీసులు, కీలక అధికారులతో కథ నడిపించారని ఆమె ఆరోపించారు.

హీరోయిన్ కేసులో పోలీస్ శాఖలోని కీలక అధికారుల పేర్లు బయటికి రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రత్యేకాధికారిని నియమించి విచారణ చేయించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తేలడంతో నాడు విజయవాడలో విధులు నిర్వర్తించిన ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపైనా ప్రభుత్వం సస్పెన్సన్ వేటు వేసింది. గత నెల 12న వీరి సస్పెన్షన్‌ను మరో 6 నెలలు పొడిగిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సస్పెన్షన్‌కు గురైనా సీనియర్ ఐపీఎస్, మాజీ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను అక్కడి నుంచి విజయవాడకు తరలించిన సీఐడీ అధికారులు దాదాపు 7 గంటల పాటు పీఎస్ఆర్ ఆంజనేయులను విచారించారు. బుధవారం ఉదయం వరకు ఆయనను సీఐడీ కార్యాలయంలోనే ఉంచి నేరుగా కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇదిలాఉండగా.. పీఎస్ఆర్ ఆంజనేయులకు మరో షాక్ తగిలింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించినట్లుగా కొత్త వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో గుంటూరు సీఐడీ పోలీసులు ఆయనపై కొత్త కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆంజనేయులు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మరోవైపు.. పీఎస్ఆర్ అరెస్ట్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే పీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారని అంబటి ఆరోపించారు. నీతి, నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన డీజీపీ స్థాయికి వచ్చారని, త్వరలో డీజీపీ కావాల్సిన వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారని రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ వ్యవహారం సినీ, రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











