ఆంధ్రాకు ముంబై నటి.. వైసీపీ నేతలకు, పోలీస్ అధికారులకు బిగిస్తున్న ఉచ్చు!

ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నది. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు వైసీపీ నేతలు, పోలీసు అధికారుల కుమ్మక్కై ఓ పారిశ్రామిక వేత్త కోసం నటిని ముంబై నుంచి కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకొచ్చి చిత్రహింసలకు గురిచేసినట్టు వస్దున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

విజయవాడ మాజీ జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ తనకు ఉన్న పరిచయంతో బాలీవుడ్ హీరోయిన్‌ను అనేక విధాలుగా వేధింపులకు గురి చేశారు. వాట్సాప్ కాల్‌లో ఫోన్ చేసి నగ్నంగా తన దేహాన్ని చూపిస్తూ అరాచకానికి పాల్పడటంపై ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు.

Kadambari Jetwani to file case in Vijayawada over torture by YSRCP Leaders and AP Police Officer

అయితే గత రెండు రోజులుగా తెలుగు టెలివిజన్ చానెల్స్‌లో నటి కాదంబరి జెత్వానీ సంచలన ఆరోపణలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశించారు. వారు సమర్పించిన ప్రాథమిక నివేదికల ఆధారంగా చర్యలకు సిద్దమవుతున్నది.

ముంబై హీరోయిన్ పై వైసీపీ నేతల వేధింపుల వ్యహరంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ దారుణం వెనుక ఐపీఎస్ అధికారులపై కూడా చర్యలు ఉంటాయి. చంద్రబాబు వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. మహిళా అధికారిని విచారణ అధికారిగా నియమించాం. మహిళా అధికారి అయితే, ఆమె పడిన బాధలు వేధింపులు చెప్పుకునే అవకాశం ఉంటుంది అని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.

Kadambari Jetwani to file case in Vijayawada over torture by YSRCP Leaders and AP Police Officer

ఇదిలా ఉండగా, కాదంబరి జెత్వానీ నుంచి వాగ్మూలం తీసుకోవడానికి, జరిగిన విషయాలపై వివరాలు సేకరించడానికి ముంబైకి పోలీస్ అధికారులు వెళ్లారు. ఆమె స్టేట్‌మెంట్ తీసుకోవడంతోపాటు నటిని విజయవాడకు తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది. సదరు హీరోయిన్ నుంచి వివరాలు సేకరించి అందుకు బాధ్యులైన అధికారులు, వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నది.

ఇదిలా ఉండగా, ఆగస్టు 30వ తేదీన గానీ, ఆ మరుసటి రోజు గానీ హీరోయిన్ జెత్వానీ తెలుగు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. విజయవాడలో ప్రెస్ మీట్‌ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ ఆమె ఈ సమావేశంలో మాట్లాడితే ఇంకా సంచలన విషయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతల పేర్లు కూడా బయటకు వస్తాయనే ఊహాగానాలు మీడియాలో వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X