కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం.. రాజ్యసభలోకి అడుగుపెట్టనున్న లోకనాయకుడు

సినిమా పరిశ్రమలో లోకనాయకుడిగా పిలుచుకొనే విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమలోను, రాజకీయ రంగంలోను రాణిస్తున్న ఆయనకు చట్ట సభల్లోకి ప్రవేశించనున్నారు. తమిళ రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రజలపై తన సిద్దాంతాలతో ప్రభావం చూపిస్తున్న ఆయన త్వరలోనే పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. కమల్‌ను రాజ్యసభ్యకు నామినేట్ చేస్తూ తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే నిర్ణయం తీసుకొన్నది. ఈ క్రమంలో త్వరలోనే జరిగే ఎన్నిక ద్వారా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అవుతారు. కమల్ గురించి, ఆయన రాజకీయ పార్టీ, తమిళనాడు రాజకీయాల గురించిన వివరాల్లోకి వెళితే..

గత నాలుగు దశాబ్దాలకుపైగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న కమల్ హాసన్ కొద్ది సంవత్సరాల క్రితం మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించారు. గతంలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి ఆయనతోపాటు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ ఓటమిపాలైనారు. అయినా తన రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అయితే పార్టీ నిర్వహించడం తనకు మించిన భారం కావడంతో ఆయన తన రాజకీయా వ్యూహాలకు పదును పెట్టారు.

Kamal Haasan in the race of Rajya Sabha

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కమల్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. తన పార్టీ మద్దతును ఆయన డీఎంకే పార్టీకి అందించారు. అయితే ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో వారి మధ్య కొన్ని రాజకీయ ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల నేపథ్యంలోనే కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపించాలని డీఎంకే పార్టీ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు అధికారికంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది.

తమిళనాడులో జూన్ 19వ తేదీన ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగనున్నది. ఈ ఎన్నికల్లో డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ బలంతో నలుగురు రాజ్యసభ సభ్యులను గెలుపించుకొనే అవకాశం ఉంది. ఈ ఎన్నికలో కమల్ హాసన్ ఓ అభ్యర్తఇగా ఉంటారు. ఈ ఎన్నిక నామమాత్రమే కానున్న నేపథ్యంలో త్వరలోనే కమల్ ఎంపీగా మారనున్నారు.

ఇదిలా ఉండగా, కమల్ ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు మణిరత్నంతో కలిసి రూపొందించిన సినిమా జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనను డీఎంకే రాజ్యసభకు నామినేట్ చేయడం చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Read more about: kamal haasan mnm dmk
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X