Kamal Haasan: అధికారం, ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. రాజ్యసభలో గర్జించిన కమల్ హాసన్

బహుభాషా నటుడు, విలక్షణ సినీ హీరో కమల్ హాసన్ సరికొత్త పాత్రలో రాజ్యసభలో దిక్కులు పిక్కటిల్లేలా గర్జించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తనకు లభించిన తొలి అవకాశాన్ని వినియోగించుకొని మొదటి స్పీచ్‌తోనే తనలోని ఉద్దేశాలతో ప్రభుత్వాన్ని హెచ్చరించే ఉపన్యాసం చేశారు. తెలుగు వారిని ఆకట్టుకొనేలా మహాకవి శ్రీశ్రీ కవితతో ప్రారంభించి.. తనలోని అభ్యుదయవాదిని తెలియజేశారు. పెద్దల సభలో కమల్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆయన ఏం మాట్లాడారనే విషయంలోకి వెళితే..

జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్ అంటూ కమల్ తన స్పీచ్‌ను ప్రారంభించారు. తాను చెప్పిన కవిత అర్ధం ఏమిటో తెలుగు వారికి బాగా తెలుసు. వ్యక్తుల మీద గానీ, ప్రభుత్వాల మీద ఎటాక్ చేయడం నా స్పీచ్ ఉద్దేశం కాదు. రాజ్యసభలో నా పదవీ కాలం ఫలప్రదంగా ఉండాలని కోరుకొంటున్నాను. రాజకీయ విభేదాలనే జగన్నాథ రథచక్రాలు వ్యత్యాసాలను తొక్కిపారేయాలి. కానీ ఎప్పుడూ ప్రజల సంక్షేమంపై తొక్కేయకూడదు. అలాంటి చర్యలను మేము ఒప్పుకోం, అనుమతించం అని ఆయన అన్నారు.

Kamal Haasan roars in Rajya Sabha

ఏ ప్రభుత్వం కూడా అధికారం మాకే శాశ్వతం అనే భ్రమలో ఉండకూడదు. అలాంటి ఆలోచనలతో అడుగులు వేయకూడదు. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా శాశ్వతంగా ఉన్నట్టు ఎక్కడ చరిత్ర చెప్పడం లేదు. భవిష్యత్‌లో కూడా ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వం విశ్వవాప్తంగా రచించని చట్టం పరిధిలోకి వస్తుందని భావించకూడదు అనే విధంగా కమల్ చురకలు అంటించారు.

పిల్లలు, యువకులు, జెన్ జీ యువత మనల్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారితో పాటు మనం, మన ప్రజాస్వామ్యం పెరుగుతూ ముందుకు వెళ్లాలి. అలా చేస్తే కనీసం రేపటి రోజు మనదే అవుతుంది అని కమల్ హాసన్ ఘాటైన ప్రసంగాన్ని చేశారు. కమల్ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు రాజ్యసభలో సహచర సభ్యులు చప్పట్లతో హోరెత్తించారు. అనంతరం ఆయనను అభినందించారు. తొలి స్పీచ్‌తోనే తన మార్కును రిజిస్టర్ చేసుకొన్నారు.

రాజ్యసభలో స్పీచ్ అనంతరం పీటీఐ, ఐఏఎన్ఎస్, ఇతర వార్తా సంస్థలతో మాట్లాడుతూ.. రాజ్యసభలో నా తొలి ప్రసంగం ముగిసింది. నాకు గొప్ప గౌరవం లభించింది. ఈ దేశం గురించి, చోటు చేసుకొంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భావోద్వేగపూరితంగా తమిళనాడులోని మారుమూల గ్రామమైన పరమకుడి అబ్బాయిగా నా గొంతుకను వినిపించాను అని కమల్ హాసన్ అన్నారు.

కమల్ హాసన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్, పొలిటికల్ లైఫ్ విషయానికి వస్తే.. సినీ పరిశ్రమలో దాదాపు 50 సంవత్సరాలుకుపైగా నటుడుగా కొనసాగుతున్నారు. నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో ప్రభావవంతమైన చిత్రాలను రూపొందించారు. 2018 సంవత్సరంలో మక్కల్ నీది మైయమ్ అనే పార్టీని స్థాపించారు. ఇటీవల డీఎంకే పార్టీతో అలయెన్స్‌ కుదుర్చుకొన్నారు. ప్రస్తుతం రాజ్యసభకు ఎన్నికైన ఆయన తొలి ప్రసంగాన్ని చేసి వార్తల్లోకి ఎక్కారు.

More from Filmibeat

Read more about: kamal haasan kollywood dmk
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X