ఎన్టీఆర్‌తో కేసీఆర్? నేను డైహార్డ్ ఫ్యాన్‌ను అంటూ.. వైరల్‌గా మయసభ‌లో సీన్!

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony Liv) అందిస్తున్న డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో మయ సభ. రైజ్ ఆఫ్ ది టైటాన్స్ ట్యాగ్ లైన్. సామాజిక స్పృహతోపాటు సెన్సేషనల్ కంటెంట్‌తో సినిమాలు రూపొందించే దేవా కట్టా షో రన్నర్‌గా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. ఈ వెబ్ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్, దివ్య దత్తా, నాజర్, రవీంద్ర విజయ్, తన్య రవిచంద్రన్, భావన వజపండల్, చరిత వర్మ, శంకర్ మహంతి తదితరులు నటించారు.

మ్యూజిక్ ఢైరెక్టర్‌గా శక్తికాంత్ కార్తీక్, సినిమాటోగ్రాఫర్‌గా సురేష్ రగుతు, జానశేఖర్ వీఎస్, ఎడిటర్‌గా ప్రవీణ్ కేఎల్ వ్యవహరించారు. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు. ఈ వెబ్ సిరీస్‌ ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సోని లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

KCR with NTR scene Mayasabha

మయసభ వెబ్ సిరీస్ రిలీజ్ తర్వాత విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకొంటున్నది. కథ కథనాలు, పాత్రల చిత్రీకరణకు పాజిటివ్ రెస్సాన్స్ వస్తున్నది. ఈ సిరీస్‌లో పాత్రల గురంచి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతున్నది. తమకు తోచిన విధంగా వారు ఈ పాత్రలను తమ దృష్టిలో ఉన్న వ్యక్తులకు అన్వయించుకొంటున్నారు. ఇందులోని ముఖ్య పాత్రలను చంద్రబాబు, వైఎస్ఆర్, ఎన్టీఆర్‌తోపాటు కేసీఆర్‌ను రిలేట్ చేసుకొంటున్నారు.

అయితే ఈ చిత్రంలో రాజకీయ నేతగా మారిన ఓ టాప్ సినిమా యాక్టర్‌ వద్దకు ఓ వ్యక్తి వచ్చి కలుస్తాడు. నేను మీకు పెద్ద అభిమానిని. నేను ఎంత అభిమానిని అంటే.. నా కొడుకుకు మీ పేరే పెట్టుకొన్నాను అంటూ సదరు పొలిటిషియన్‌కు చెబుతాడు. ఎవరైతే అభిమాని కనిపించారో.. ఆయనను కేసీఆర్‌తో పోల్చుకొని ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకొంటే.. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ అభిమాని కావడం.. అలాగే ఆయన తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకోవడం సన్నివేశానికి యాప్ట్ అయింది.

ఎన్టీఆర్‌తో కేసీఆర్‌ ఉన్నట్టు భావిస్తున్న సన్నివేశానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు దేవ కట్టా.. కేసీఆర్ పాత్రధారిని బాగా సెట్ చేశాడు. ఎక్కడ నుంచి పట్టుకొచ్చాడో కానీ.. బాగా వెతికి పట్టుకొన్నాడు అంటూ నెటిజన్ కామెంట్ పెడుతున్నారు. ఈ వీడియోనే కాకుండా ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మయసభ వెబ్ సిరీస్‌లో డై హార్డ్ ఫ్యాన్‌గా చెప్పుకొంటున్నది ఎవరో గుర్తుపట్టండి?. దేవ కట్టా చాలా సన్నివేశాల్లో మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని కీలక సన్నివేశాలకు భారీగా స్పందన వస్తున్నది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు మరింత చేరువైతే సోషల్ మీడియాలో భారీగానే చర్చ జరిగే అవకాశం ఉంటుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Read more about: kcr Mayasabha deva katta
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X