కంగన రనౌత్ సినిమాల్లో ఓ వేశ్య.. కాంగ్రెస్ నేత దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగన రనౌత్‌పై కాంగ్రెస్ నేత దానం నాగేందర్ వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన తీవ్ర పదజాలంతో దూషించడం అత్యంత వివాదంగా మారింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఎంపీ కంగన రనౌత్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన ప్రసంగం వివరాల్లోకి వెళితే..
తాజాగా హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన సమావేశంలో కంగన రనౌత్‌పై దానం నాగేందర్ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. దాంతో ఆయన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

తాజా మీడియా సమావేశంలో దానం మాట్లాడుతూ.. సినిమాల్లో భోగం వేషం వేసే కంగన రనౌత్ గారు.. రాహుల్ గాంధీపై మాట్లాడే.. విమర్శించే హక్కు ఉందా? అని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాలకు నిలయమైన కుటుంబం. దేశం కోసం ఏ కుటుంబమైనా జీవితాలను అర్పించిందంటే అది రాహుల్ గాంధీ కుటుంబం మాత్రమే అని ఆయన అన్నారు.
దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాందీ ఎనలేని సేవ చేశారు. వారి తర్వాత రాహుల్ గాంధీ తన జీవితాన్ని త్యాగం చేసి దేశం కోసం సేవ చేస్తున్నారు అని అన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో, ఎక్కడ ఆయన ఈ వ్యాఖ్యలు చేసిందనే విషయం తేలాల్సి ఉంది.

అయితే ఓ మహిళ ఎంపీపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ్యత, సంస్కారం లేకుండా వేశ్యగా ఆమెను చిత్రీకరించడం సరికాదు అని అంటున్నారు. ఇక దానం నాగేందర్ విషయానికి వస్తే.. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ టికెట్ కోసం ఆశించారు. కానీ ఆ పార్టీ అధిష్టానం ఆయనకు అవకాశం ఇవ్వలేదనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











