సమంత కేసులో కోర్టు హాజరైన కేటీఆర్.. నిందారోపణలు నోటితో చెప్పలేనని ఆవేదన!

స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు కేంద్ర బిందువుగా చోటు చేసుకొన్న వివాదంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతకాలంగా రేవంత్ రెడ్డి, బీజేపీ నేత రఘునందన్ రావు పరోక్షంగా సమంతను లింక్ చేస్తూ కేటీఆర్‌పై ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు దేశవ్యాప్తంగా మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వివాదంలో తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ సందర్భంగా ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

మెదక్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మంత్రి రఘునందన్ రావు తనకు సన్మానం చేస్తూ శాలువా కప్పడంపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరకరమైన పోస్టులతో కొండా సురేఖను అవమానించే ప్రయత్నం చేశారు. అలాంటి ట్రోల్స్‌ను తట్టుకోలేకపోయిన ఆమె ఓ దశలో సహనం కోల్పోయింది. ఇదంతా కేటీఆర్ అధ్వర్యంలో జరుగుతున్నదంటూ ఆయనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

KTR appeared in court Samantha Ruth Prabhu Related Konda Surekha Defamation case

కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం తన ప్రతిష్టను భంగ పరిచే విధంగా నాపై పోస్టులు పెడుతున్నారు. కేటీఆర్‌కు సమంతకు ఉన్న బంధం ఏమిటో అందరికి తెలుసు. కేటీఆర్ వద్దకు వెళ్లమని నాగార్జున, నాగచైతన్య బలవంతం చేయడంతో ఇష్టం లేక సమంత విడాకులు తీసుకొన్నది. సమంత,చైతూ విడాకులకు కేటీఆర్ కారణమని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అంత్యంత వివాదం కావడంతో సమంతకు కొండా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల్లో ఉద్దేశం తనను కించపరచడం కాదని వివరణ ఇచ్చారు. అయితే గతంలో సమంతకు చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవిని కట్టబెట్టడంపై రఘునందన్ రావు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు

అయితే సమంత, చైతన్య విడాకులకు కారణం తనే కారణమనే ఆరోపణలపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో వాగ్మూలం ఇవ్వడానికి ఆయన బుధవారం కోర్టుకు హాజరయ్యారు. ఆయన రాకతో కోర్టు హాలంతా కిక్కిరిసిపోయింది. ఆయన వెంట ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. కోర్టు ప్రాంగణంలో అభిమానులు, కార్యకర్తలతొ కలిసి చాయ్ తాగారు.

KTR appeared in court Samantha Ruth Prabhu Related Konda Surekha Defamation case

కోర్టులో వాగ్మూలం ఇచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న నాకు కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం కలిగించాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏమిటి అని, వాటి గురించి వివరాలు చెప్పగలరా అని జడ్జి ప్రశ్నించారు. అయితే ఒక మహిళ పట్ల తనకున్న గౌరవం నేపథ్యంలో... కొండా సురేఖ సాటి మహిళ సమంతపై చేసిన అతినీచమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తిరిగి చెప్పడం ఇష్టం లేదని కేటీఆర్ కోర్టుకు తెలిపారు

కొండా సురేఖ సాటి మహిళ పమంతపై చేసిన వ్యాఖ్యల తాలూకు పూర్తి రాతపూర్వక ఫిర్యాదును మీ ముందట ఉంచాను. వాటిని నేరుగా నేను తన నోటితో చెప్పలేను, ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ కుట్రపూరితంగా తనపై అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారు అని కేటీఆర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X