Ajit Pawar:విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం.. తీవ్ర విషాదంలో పవన్ కల్యాణ్

మహారాష్ట్ర రాజకీయ రంగాన్ని, సినీ రంగాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణ వార్త తీవ్ర విషాదంలోకి నెట్టింది. రాష్ట్రంలోని జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో పవార్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బారామతికి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దారుణ ఘటనలో అజిత్ పవార్‌తోపాటు ఆరుగురు సిబ్బంది మరణించారు. ఈ విషాద వార్త ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా కలిచి వేసింది. అజిత్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన తెలియజేస్తూ సంతాప ప్రకటనను విడుదల చేశారు. తన సంతాప ప్రకటనలో ఇటీవల ఆయనను కలుసుకొన్న ఫోటోలను షేర్ చేశారు. పవన్ కల్యాణ్ సంతాప ప్రకటనలో ఏం చెప్పారంటే?

మహరాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, మహా నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎన్టీఏ కూటమిలో భాగస్వామి శ్రీ అజిత్ దాదా పవార్ జీ హెలికాప్టర్ ప్రమాద దుర్ఘటనలో మరణించారనే వార్త నన్ను తీవ్రంగా కలిచి వేసింది. మహారాష్ట్ర అభివృద్ధి, ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అంకిత భావంతో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆశయాలను ప్రజలు ముందుకు తీసుకెళ్తారని ప్రగాఢ విశ్వాసం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన ఫాలోవర్స్‌, పార్టీ కేడర్‌ను నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని పవన్ కల్యాణ్ తన సంతాప ప్రకటనలో తెలిపారు.

Ajit Pawar death Pawan Kalyan

కొద్ది రోజుల క్రితం నాందేడ్‌లో జరిగిన సిక్కుల మతపరమైన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రయానికి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. పవార్‌తో కలిసి ఉన్న ఫోటోను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ షేర్ చేశారు. అలాగే ఇటీవల ప్రధాని నరేంద్రమోదీతో పవార్, ఇతర నేతలతో కలిసి ఉన్న ఫోటోను కూడా జనసేన అధినేత పంచుకొన్నారు.

ఇదిలా ఉండగా, అజిత్ పవార్ మరణంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అజిత్ పవార్ గారు ప్రజా నాయకుడు. ఆయనకు గ్రామ మూలాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. మహరాష్ట్ర ప్రజలకు సేవలందించడానికి నిత్యం శ్రమించే ఆయన అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం, గౌరవం. అణగారిన ప్రజల సంక్షేమం, చైతన్యం కోసం పాటు పడిన తీరు, ప్రజల సమస్యలపై ఆయనకు ఉన్న అవగాహన అందరికీ స్పూర్తిదాయకం. ఆయన అకాల మరణం అత్యంత బాధాకరం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, ఆయన అనుచరులకు నా ప్రగాఢ సంతాపం అని మోదీ తన సంతాప ప్రకటనలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X