‘మహేశ్ బాబు సూపర్ హిట్.. వైఎస్ జగన్ అట్టర్ ఫ్లాప్’

సినిమా కథలను తెర మీద ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ అవే పనులు వాస్తవంగా ప్రజా జీవితంలో అమలు చేస్తే ప్రజలు పట్టించుకోరు అని వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. అందుకే వైఎస్ జగన్‌కు ఓటమి తప్పలేదని ఆయన అన్నారు. భరత్ అనే నేను సినిమా గురించి ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతిరెడ్డి మాట్లాడుతూ..

అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ పరాజయం తర్వాత పార్టీ గురించి, కార్తకర్తల గురించి రకరకాల చర్చ జరిగింది. పార్టీ క్యాడర్ ఎందుకు దూరమైందనే కోణంలో చర్చలు జరిపాం. వాలంటీర్ వ్యవస్థను తీసుకు రావడం వల్ల కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారనే విషయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాంటి లోపాలను, అంతర్గత విషయాలను బేరీజు వేసుకొన్నాం. సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.

Mahesh Babu s Bharat Ane Nenu Super Hit YS Jagan Flop Show Says Kethireddy Venkatarami Reddy

ప్రజా సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడం వల్ల పార్టీకి గానీ, పార్టీ నేతలకు గానీ ఎలాంటి మేలు చేయలేదు. సంక్షేమ పథకాలు పార్టీకి సంబంధం లేకుండా ప్రజలకు చేరవేయడం ప్రతికూల ఫలితాలు ఇచ్చింది. అలాంటి లోపాలను సవరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని ఆయన అన్నారు.

వైఎస్ జగన్‌లో మార్పు రావాల్సిన అవసరం లేదు. జగన్ అలా ఉంటారనే ఆయనను ఫాలో అయ్యాం. ఆయన చెప్పిందే చేస్తాడు. చేసేది చెబుతాడు. జగన్.. జగన్ లానే ఉండాలి. ఎలాంటి మార్పు అవసరం లేదు. ఆయన మార్చుకొంటూ వెళితే లీడర్ ఎలా అవుతాడు. తాను నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ఉండాల్సిందే అని కేతిరెడ్డి అన్నారు.

వైఎస్ జగన్‌కు సినిమా పరిశ్రమకు సంబంధించిన గ్యాప్ గురించి మాట్లాడుతూ.. టికెట్ రేట్ల పెంపును వైసీపీ ప్రభుత్వం అడ్డుకొన్నది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేసింది. ఇప్పుడు ఎవరూ కూడా ఏం మాట్లాడటం లేదు. ఏదైనా మాట్లాడితే.. ఇబ్బందులు ఎదుర్కొన్నాల్సి వస్తుంది. అందుకే సినిమా పరిశ్రమ ప్రముఖులు ఏమీ మాట్లాడటం లేదు అని కేతిరెడ్డి పేర్కొన్నారు.

సినిమా బడ్జెట్ పెరిగిపోవడం వల్లే టికెట్ల రేట్లు పెంచాల్సి వస్తుందని సినిమా వర్గాలు అంటున్నాయి. క్వాలిటీని పెంచడానికి బడ్జెట్ పెడుతున్నామని చెబుతున్నారు. అలా కాకుండా హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. ప్రొడక్షన్ క్వాలిటీలో ఖర్చు పెంచితే క్వాలిటీ వస్తుంది. హీరోలు, సాంకేతిక నిపుణుల పారితోషికం పెంచడం వల్ల క్వాలిటీ రాదు కదా.. బడ్జెట్ పెరిగిపోతుంది. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

భరత్ అనే నేను సినిమాలో హీరో మహేష్ బాబు ఏం చేశాడో.. వాస్తవంగా ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే చేశాడు. స్కూల్స్, హాస్పిటల్, పాలన వికేంద్రికరణ చేశాడు. సినిమా ఎండ్‌లో నాయకుడు లేని సమాజం తయారు చేయడమే నిజమైన నాయకుడి లక్ష్యం అని చెబుతారు. జగన్ అది కూడా చేశాడు. కానీ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక్కడ జగన్ ఎత్తిపోయాడు అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X