దావోస్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా చిరంజీవి.. మెగాస్టార్‌కు రేవంత్ రెడ్డి అరుదైన గౌరవం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశీ గడ్డపై కూడా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఓ పక్క ఆయన నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుంటే.. మరో పక్కన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా వెళ్లడం విశేషంగా మారింది. జ్యురిచ్ నగరంలో జరుగుతున్న ఈ దిగ్గజ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నది. ఈ సమావేశం వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి బరిలో దూకిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకులకు చేరువై.. బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి చాటిన చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే చిరంజీవి జ్యురిచ్‌లో ఉన్నారనే విషయం తెలంగాణ ప్రభుత్వానికి తెలిసింది. దాంతో ఈ సమావేశంలో పాల్గొనాలని ఆయనను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానంలో భాగంగా దావోస్‌లో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుండటంతో ఆయనకు స్పెషల్ ఇన్విటేషన్ అందింది.

తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం మేరకు దావోస్ సమావేశానికి వచ్చిన చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంచలన విజయం సాధించిన మన శంకర వరప్రసాద్ సినిమా గురించి ప్రస్తావించారు. తన కుటుంబంతో కలిసి ఆ సినిమాను వీక్షించాను. సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలోని వినోదం తనను ఆకట్టుకొన్నది. ముఖ్యంగా మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని సీఎం రేవంత్ అన్నారని తెలిసింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర సహచర మంత్రుల ఆహ్వానం మేరకు చిరంజీవి దావోస్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రజెంటేషన్‌ను ప్రదర్శించగా.. దానిని మంత్రులు, ముఖ్యమంత్రితో కలిసి వీక్షించారు. తెలంగాణ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌లోని విషయాలను ఈ సందర్భంగా చిరంజీవి స్వయంగా అడిగి తెలుసుకొన్నారు అని తెలిసింది.
ఎకనామిక్ ఫోరమ్ గ్లోబల్ సమ్మిట్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి, ఇతర మంత్రులు అప్యాయంగా కలిసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు విషయలు, రాజకీయాలు చర్చకు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలు కలిసి ముందుకెళ్లాలనే ఆలోచనను పంచుకొన్నట్టు తెలిసింది.
చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుతూ సహకరించింది. దాంతో ఈ చిత్రం నైజాంలో భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 300 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించి.. చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











