అసెంబ్లీలో సీతక్క 'కోట శ్రీనివాసరావు కోడికథ' .. కేటీఆర్‌కు కౌంటర్, నవ్వులే నవ్వులు

తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ, విలన్, సహాయ నటుడు ఇలా ఏ క్యారెక్టర్‌నైనా అద్భుతంగా పోషించగల నటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు. పాత్ర ఏదైనా సరే అందులోకి పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఆయన సొంతం. తెరపై చూస్తున్నంతసేపు సదరు పాత్రే కనిపిస్తుంది తప్పించి కోటా కనిపించరంటే అతిశయోక్తి కాదు. హాస్యనటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందలాది సినిమాల్లో కోటా శ్రీనివాసరావు నటించారు. వీటిలో ఏ పాత్రకు ఆ పాత్ర ప్రత్యేకం. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఎన్నో విశిష్ట పురస్కారాలు వరించాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీతో కోటాను గౌరవించింది.

కోటా శ్రీనివాసరావు వేసిన కొన్ని పాత్రలు చూస్తే.. వాటిని మరొకరు పోషించాలనే సాహసం కూడా చేయలేరు. అలాంటి వాటిలో ఒకటి హాస్య బ్రహ్మా జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన అహనా పెళ్లంటలోని లక్ష్మీపతి పాత్ర. నోరు విప్పాలన్నా చేయి తడపాల్సిందనే పరమ పిసినారి రోల్ అది. ఈ క్యారెక్టర్‌లో కోటా శ్రీనివాసరావు అద్భుతంగా నటించారు అనడం కంటే జీవించారు అనడం బాగుంటుంది. లక్ష్మీపతి పాత్ర కోటా కోసమే రాశారా అన్నంతగా ఒదిగిపోయారాయన.

minister seethakka mentioned actor kota srinivasa rao s aha naa pellanta movie scene in telangana assembly

తొలుత లక్ష్మీపతి పాత్రను దిగ్గజ నటుడు రావు గోపాలరావుతో వేయించాలని అనుకున్నారట ిర్మాత రామానాయుడు. అయితే దర్శకుడు జంధ్యాల మాత్రం కోటా శ్రీనివాసరావే కావాలని పట్టుబట్టారట. అప్పటికే రిలీజైన మండలాధీశుడు చూసి జంధ్యాలకు ఆయన బాగా నచ్చడంతో.. కోటాతోనే ఈ రోల్ వేయించి తీరాలని మంకుపట్టుపట్టడంతో చివరికి రామానాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఎయిర్‌పోర్టులోనే నాయుడుగారికి డేట్స్ ఇచ్చినట్లు కోటా ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.

అసిస్టెంట్‌గా అ గుండు పాత్రలో బ్రహ్మానందం రెచ్చిపోవడంతో కోటా విజృంభించి నటించారు. హీరో రాజేంద్రప్రసాద్‌ క్యారెక్టర్‌ను మించి కోటా శ్రీనివాసరావు డామినేట్ చేసిందంటే ఆయన ఎంతలా ప్రాణంపెట్టి నటించారో అర్ధం చేసుకోవచ్చు. అహనా పెళ్లంట సినిమాలో లక్ష్మీపతి పిసినారి రోల్‌‌కు తగ్గట్టుగా కొన్ని సీన్లు డిజైన్ చేశారు జంధ్యాల. పేపర్‌ను లుంగిలా చుట్టుకోవడం, రాత్రుళ్లు బస్టాంట్ వద్ద టీ అమ్మడం, వంట చెరకుగా అగ్గిపుల్లలు, ఎండు కొబ్బరి చిప్పలు ఏరుకోవడం వంటి సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అన్నింటిలోకి బతికున్న కోడిని ఇంటి చూరుకు వేలాడదీసి కోడికూర తింటున్నట్లుగా ఫీలవుతూ కోటా ఇచ్చిన ఎక్స్‌ప్రేషన్స్ .. ప్రేక్షకుల నోరూరేలా చేస్తాయి. పిసినారితనం గురించి చెప్పాల్సి వచ్చినా, పోల్చాల్సి వచ్చిన లక్ష్మీపతి క్యారెక్టర్ తాలుకూ ఎమోజీలు, మీమ్స్‌ను నేటితరం వాడుతూ ఎం ాయ్ చేస్తోంది.

తాజాగా లక్ష్మీపతి 'కోడి' ఎపిసోడ్ ఏకంగా తెలంగాణ అసెంబ్లీలో చర్చనీయాంశమైంది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వాడివేడి ప్రసంగం చేశారు. దీనికి మంత్రి సీతక్క అదే స్థాయిలో కౌంటరిచ్చారు. కేటీఆర్ తన వాగ్థాటితో సభను పక్కదారి పట్టిస్తున్నారని.. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వారి పార్టీయే నిరుద్యోగులను మోసం చేసిందని ఎద్దేవా చేశారు. నాటి కేసీఆర్ సర్కార్ వ్యవహారం అహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడికథ మాదిరిగా ఉందని.. నోటిఫికేషన్ ఇచ్చుడు, ఓట్లేస్తేనే ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టుడు అనే సూత్రాన్ని అనుసరించారని సీతక్క ధ్వజమెత్తారు. ఆమె మాటలతో సభ్యులంతా కోటా నటనను గుర్తుచేసుకుని నవ్వుకున్నారు. ప్రస్తుతం సీతక్క కోడికథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వ్యాఖ్యలతో అహనా పెళ్లంట సినిమాను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు.

More from Filmibeat

Read more about: seethakka kota srinivasa rao ktr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X