భర్తతో విడాకుల తర్వాత సమరసింహారెడ్డి పాటపై స్టెప్పులు.. బాలకృష్ణ సాంగ్‌పై శాంతి, మదన్ డ్యాన్స్ వీడియో వైరల్
ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నేత, ఎంపీ విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధం అంటూ ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ శాంతిపై భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలన వివాదంగా మారింది. అయితే మదన్ మోహన్ ఆరోపణల తర్వాత సదరు మహిళా అధికారి, ఎంపీ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి వారి వారి అభిప్రాయాలను, వాదనలను వినిపించారు.
అయితే మదన్ మోహన్ ఆరోపణలను ఖండిస్తూ.. తాము విడాకులు తీసుకొన్నామని స్పష్టం చేశారు. అయితే విడాకుల తర్వాత తన భర్తతో బాలకృష్ణ సినిమాలోని పాటకు వారిద్దరు చేసిన వైరల్ అయింది. ఈ వివాదం.. బాలకృష్ణ పాటపై చేసిన డ్యాన్స్‌కు ప్రాముఖ్యత ఎందుకు లభించిందంటే?

ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో నెంబర్ 2 గా ఉన్న నేతతో అక్రమ బంధం వల్ల కొడుకు పుట్టాడని భర్త చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. నాకు భర్తతో సంబంధం లేదు. గిరిజన సంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకొన్నాం. ఆ తర్వాత సుభాష్ రెడ్డితో నాకు రిలేషన్‌షిప్ ఉంది. ఆయన వల్లే నాకు బిడ్డ పుట్టారు అని శాంతి చెప్పారు.
అయితే 2016లోనే విడాకులు తీసుకొంటే.. 2021లో శాంతి, మదన్ మోహన్ కలిసి వైజాగ్ బీచ్‌లో నందమూరి బాలకృష్ణ నటించిన ఓ పాటపై ఇద్దరు ఆనందంగా, సంతోషంగా డ్యాన్స్ చేశారు. విడాకుల తర్వాత అది ఎలా సాధ్యం అంటూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ వీడియోతోపాటు కథనాన్ని ప్రసారం చేసింది.
ఇదిలా ఉండగా, తనకు సుభాష్ రెడ్డితో రిలేషన్‌షిప్ ఉందని చెప్పిన శాంతి మాటలు మరింత వివాదాస్పదం అవుతున్నాయి. శాంతి చెప్పిన మాటలను సుభాష్ ఖండించినట్టు ఓ ఆడియో ఫైల్ మీడియాలో లీక్ అయింది. తనకు ఓ కుటుంబం ఉంది. శాంతి నాకు ఎలాంటి సంబంధం లేదు. హాస్పిటల్‌లో సంతకం పెట్టమని ఓ పేపర్ ఇచ్చారు. అయితే అన్నో, తండ్రో, మామ, ఇతర రిలేషన్‌షిప్ అనుకొని సంతకం పెట్టాను. కానీ భర్తగా సంతకం పెట్టించుకొంటారని అనుకోలేదనే చెప్పిన ఆడియో ఫైల్ వైరల్ అవుతున్నది.
ఇలాంటి భిన్న, పరస్పర విరుద్ధంగా ఎంపీ, శాంతి, మదన్,సుభాష్ చెబుతున్న, వెల్లడిస్తున్న అభిప్రాయలు ఈ వివాదాన్ని గందరగోళంగా మార్చాయి. ఇవన్నీ ఆరోపణలు పక్కన పెడితే.. శాంతి బిడ్డకు తండ్రి ఎవరు? అనే ప్రశ్న ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశమైంది. మరోపక్క విడాకుల తర్వాత వివాహ వార్షికోత్సవం రోజున బాలకృష్ణ పాటపై వారిద్దరు చేసిన డ్యాన్స్ వైరల్ అవుతున్నది.
ఇక బాలకృష్ణ నటించిన పాట విషయానికి వస్తే.. శాంతి, మదన్ మోహన్ డ్యాన్స్ చేసిన పాట సమరసింహారెడ్డి సినిమాలోనిది. అందాల ఆడబొమ్మ అనే పాటపై బాలయ్య, సిమ్రాన్ వేసిన స్టెప్పులు అభిమానులను, ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అదే పాటపై వారిద్దరూ డ్యాన్స్ చేసినట్టు వీడియో వైరల్ కావడంతో పాట మళ్లీ ఓసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే డ్యాన్స్ వీడియో విడాకులకు ముందా? తర్వాతనా? అనేది పక్కన పెడితే.. మళ్లీ ఈ పాట ఫ్యాన్స్‌ను కేక పెట్టించేలా చేసింది.


Click it and Unblock the Notifications











