పవన్‌ కళ్యాణ్‌ని అందుకోలేం.. మనకంటే పది అడుగులు ముందే , బాబాయ్‌పై నిహారిక ప్రశంసలు

మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు డజను మంది హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. ఈ ఒక్క కుటుంబం పేరు మీదే రూ. వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ నుంచి అంతా హీరోలేనా ఎవ్వరూ హీరోయిన్లు రారా అనుకుంటున్న టైంలో నాగబాబు కుమార్తె నిహారిక అడుగుపెట్టారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా అవి అంతగా వర్కవుట్ కాకపోవడంతో నిర్మాతగా మారారు. పలు వెబ్ సిరీస్‌, సినిమాలను నిర్మిస్తోంది.

చైతన్యతో విడాకుల తర్వాత వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోంది. అయినప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తనను తాను నిరూపించుకుంది. గతేడాది డెడ్ పిక్సెల్స్ అనే సిరిస్‌లో నటించిన నిహారిక .. ఇప్పుడు కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించింది. వాట్ ద ఫిష్ అనే మూవీతో మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుంది. ఇందులో ఆమె అష్టలక్ష్మీ అనే పాత్ర పోషించనున్నారు. మరో తమిళ సినిమా కూడా నిహారిక చేయనున్నారని ఫిలింనగర్ టాక్. ఆగస్ట్ 9న కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో నిహారిక అండ్ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

nagababu daughter konidela niharika praised AP Dy CM pawan kalyan

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నిహారిక తన వ్యక్తిగత సంగతులు, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. నిర్మాతగా మారిన తర్వాత వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్న నిహారిక తాజాగా ఓ ఛానెల్‌తో ముచ్చటించారు. తన పెళ్లి, విడాకులు, సినిమా సంగతులను ఆమె షేర్ చేసుకున్నారు. విడాకులు తీసుకుని రెండేళ్లవుతోందని.. అది ఎంత బాధ పెడుతుందో తనకు మాత్రమే తెలుసునని, ఆ సమయంలో ఎంతో ఏడ్చానని నిహారిక వెల్లడించారు. తన తల్లిదండ్రులకు సపోర్ట్‌గా ఉండాలనుకుంటున్నానని.. ఎవరో తప్పుడు వ్యక్తిపై ఆధారపడలేమన్నారు. జీవితాంతం కలిసి ఉండాలనే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారని, కానీ లైఫ్ నేను అనుకున్నట్లుగా లేదని నిహారిక తెలిపారు. తానింకా ప్రేమకు తలుపులు మూసేయలేదని, ఇప్పటికైతే తాను సింగిలేనని ఆమె వెల్లడించారు.

ఇదే ఇంటర్వ్యూలో వైసీపీ అభ్యర్ధికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం, నాగబాబు ట్వీట్‌పైనా యాంకర్ ప్రశ్నించగా.. నిహారిక స్పందించారు. మా నాన్న సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారని, ట్విట్టర్, వాట్సాప్‌లలో ఏదో ఒక సుత్తి పెడుతుంటారని .. ఆ పోస్ట్‌కు కూడా రీజన్ లేదని, అయినా ఎవరు ఏం పోస్ట్ చేసినా ఎవరి రీజన్స్ వాళ్లకుంటాయని నిహారిక తెలిపారు. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఎవరి ఇష్టం వాళ్లదని.. తనకు మాత్రం ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అని ఆమె స్పష్టం చేశారు.

nagababu daughter konidela niharika praised AP Dy CM pawan kalyan

తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌ వ్యక్తిత్వంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. మేం ఫస్ట్ స్టెప్ నుంచి ఆలోచిస్తే, ఆయన పదో స్టెప్ నుంచి ఆలోచిస్తారని .. ఆలోచనల్లో మనకంటే ఓ అడుగు ముందే ఉంటారని నిహారిక తెలిపారు. నాన్న ద్వారా బాబాయ్ ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటానని, జనం బాధలు ఓపిగ్గా విని సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారని ఆమె తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన వ్యక్తిని ఎన్నుకున్నారని నిహారిక కొనియాడారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X