హిందూపురంలో బాలకృష్ణకు వింత అనుభవం.. నందమూరి ఫ్యాన్స్ ఆందోళన

నందమూరి నట వారసుడు, నటసింహం బాలకృష్ణ ఎప్పుడూ ఏదో రూపంలో వార్తల్లో ఉంటూనే ఉంటారు. కొన్నిసార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మరొకొన్ని సార్లు సంచలన వార్తలతో మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఓ తీవ్రమైన వివాదంలో ఆయన కొనసాగారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియాలోను, రాజకీయ, సినీ రంగాల్లో దుమారం సృష్టించాయి. ఇలాంటి వివాదం సద్దుమణుతున్న సమయంలో తన అభిమానులే హిందూపురంలో ఆందోళన చేపట్టారు. ఫ్యాన్స్ చేసిన హడావిడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ ముక్కుసూటిగా వ్యవహరించడంలో ముందుంటాడు. మనసులో ఏది తోచితే మొహమాటం లేకుండా ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంటారు. అలాంటి విషయాలు ఆయనకు కొన్నిసార్లు ఇబ్బందికి గురి చేస్తుంటాయి. అయినా తనదైన శైలిలో ఆయన వ్యవహరిచడానికి దూరంగా ఉండలేరు. అయితే తనకు నచ్చిందే చేస్తూ.. తనకు నచ్చంది పట్టించుకోకుండా ఉండటమే ఆయన నైజం అంటుంటారు.

Nandamuri Balakrishna

అయితే తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు భూకంపం సృష్టించినంత పని చేశాయి. అసెంబ్లీలో మాట్లాడుతూ.. చిరంజీవి, వైఎస్ జగన్ గురించి ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర విమర్శలకు గురయ్యాయి. సీఎంగా ఉన్న కాలంలో వైఎస్ జగన్‌ సినీ తారలతో భేటికి రావడానికి ఇష్టపడలేదు. అతడు ఓ సైకో గాడు అంటూ ఆయన కామెంట్ చేశాడు. అంతేకాకుండా ఆ సమావేశంలో చిరంజీవి ఆయనను బతిమాలడలేదు. ఆయన రమ్మంటే వచ్చారనడం అబద్దం అంటూ కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా ఫిలిం డెవలప్మెంట్‌కు సంబంధించిన జాబితాలో తన పేరు 9వ స్థానంలో పెట్టడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం రాజకీయంగా, సినీ రంగాల్లో ప్రకంపనలు సృష్టించాయి.

ఈ వివాదం నుంచి బయటపడిన ఆయన తాజాగా సోమవారం హిందూపురంలో పర్యటించారు. అయితే తన అభిమానులు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేస్తూ ఆయన వాహనాన్ని అడ్డుకొన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా రాణిస్తున్న బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి. నందమూరి బాలకృష్ణ మంత్రి పదవిని స్వీకరించాలి అంటూ ఆయన అభిమానులు ఆందోళన చేపట్టారు. ఆయనకు మద్దతుగా తన గళాన్ని వినిపించారు.

తనపై ప్రేమను కురిపిస్తూ, రాజకీయంగా తన అభివృద్ధిని ఆకాక్షిస్తూ నినాదాలు చేసిన అభిమానులను ఆనందంగా పలకరించారు. వారి అభిమానంతో పొంగిపోయిన ఆయన.. వారితో కాసేపు ముచ్చటించారు. అయితే మంత్రి పదవి చేపట్టాల్సిందే అంటూ ఫ్యాన్స్ పట్టుబట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ.. నాకు చదువు పట్ల అంతగా ఆసక్తి ఉండేది కాదు. అయినా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, సినీ రంగంలోకి ఎంటర్ అయ్యాను అని తెలిపారు.

నా సినిమాలు సమాజానికి మెసేజ్ ఇచ్చేలా ఉంటాయి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మా నాన్న ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్నా. నాన్న కోరిక మేరకే రాజకీయాల్లో రాణిస్తున్నా అని తెలిపారు. అయితే తన అభిమానులు, కార్యకర్తల డిమాండ్ విని చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే.. నటుడిగా, బసవతారకం హాస్పిటల్ అధినేతగా, హిందూపురం శాసనసభ్యుడిగా పలు పాత్రల్లో రాణిస్తున్నారు. టెలివిజన్‌లో హోస్టుగా తనకంటూ ముద్ర వేసుకొన్నారు. సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయాల్లో విశేషంగా అనుభవం ఉన్న ఆయనకు మంత్రి పదవిని అభిమానులు కోరుకోవడంలో తప్పేమీ లేదని సినీ, రాజకీయ వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X