బాలా అన్నయ్య థ్యాంక్స్.. బాలకృష్ణపై నారా భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్
నందమూరి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఎన్టీఆర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తర్వాత కొడుకులు, కూతుళ్లలో కొందరు తమదైన రంగాల్లో రాణిస్తున్నారు. అలా సినిమాల్లో స్టార్‌గా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తోన్న సమయంలో ఆయన తన సోదరి నారా భువనేశ్వరిపై ప్రేమను చూపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన సోదరుడిపై ట్వీట్ చేశారు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
గ్రాండ్‌గా ప్రమాణ స్వీకారం
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు విజయవాడ సమీపంలోని కేసరిపల్లి దగ్గర ప్రమాణ స్వీకరణ మహోత్సవం నిర్వహించగా.. అది ఎంతో గ్రాండ్‌గా జరిగింది. దీనికి ప్రధాని మోదీతో పాటు ఎంతో మంది నాయకులు, ప్రముఖులు హాజరై సక్సెస్ చేశారు.

వాళ్లంతా ప్రమాణం చేస్తూ
రెండు రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. ఆయన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ అక్కడకు వచ్చిన ప్రముఖులు, పార్టీల కార్యకర్తలు సంబరపడ్డారు.
సోదరికి బాలయ్య ముద్దు
ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నారా, నందమూరి ఫ్యామిలీ మెంబర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మొత్తంలో తన సోదరి నారా భువనేశ్వరి స్టేజ్‌పై కూర్చున్న సమయంలో నందమూరి బాలకృష్ణ వచ్చి ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ తర్వాత తన సోదరి నుదుటిన ముద్దు పెట్టి ప్రేమను చూపించారు.

వీడియో వైరల్ కావడంతో
నారా భువనేశ్వరిపై నందమూరి బాలకృష్ణ ప్రేమను చూపిస్తూ నుదుటిన ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. వీళ్లిద్దరి బాండింగ్ చూసిన అభిమానులు కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో చాలా మంది నెటిజన్లు కూడా ఈ వీడియోను బాగా షేర్ చేశారు. కొందరు ఔత్సాహికులు అయితే దీనిపై పాజిటివ్‌గా మీమ్స్ కూడా క్రియేట్ చేశారు.
భుశనేశ్వరి ఎమోషనల్‌గా
నందమూరి బాలకృష్ణ తనపై చూపించిన ప్రేమకు నారా భువనేశ్వరి ఫిదా అయ్యారు. ఈ మేరకు ఆ వీడియోను X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఆమె 'ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో.. నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేశావు. థాంక్స్ బాలా అన్నయ్య' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇది చూసిన వాళ్లంతా ఎన్టీఆర్ బిడ్డల మధ్యన ఉన్న బాండింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఏ దిష్టి తగలకూడదు
నారా భువనేశ్వరి తాజాగా చేసిన ట్వీట్‌పై నారా, నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది 'ఏ దిష్టి తగలకుండా నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి అమ్మా' అంటూ దీవిస్తున్నారు.


Click it and Unblock the Notifications











