శ్రీజ లైఫ్‌ను నాశనం చేసింది వాళ్లే.. చిరంజీవిపై కక్ష సాధింపు అలా.. భగ్గుమన్న పవన్ కల్యాణ్

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూశారు. ఊపిరితిత్తులు పాడవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. శిరీష్ మరణవార్త తెలుసుకుని చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. 2007లో శ్రీజ - శిరీష్‌లు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి వ్యవహారం టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే హాట్ టాపిక్‌గా మారింది. 2014లో శ్రీజ- శిరీష్ దంపతులకు ఒక బిడ్డ పుట్టింది. ఈ క్రమంలో తనను శిరీష్ వేధిస్తున్నాడని, అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ శ్రీజ ఆరోపించడం అంతే వివాదాస్పదమైంది. మనస్పర్ధల నేపథ్యంలో శిరీష్‌కు శ్రీజ విడాకులు ఇచ్చి తిరిగి పుట్టింటికి చేరుకున్నారు.

2016లో వ్యాపారవేత్త కళ్యాణ్‌దేవ్‌ను శ్రీజ రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. కానీ దురదృష్టవశాత్తూ మరోసారి శ్రీజ వైవాహిక జీవితం కుదుపులకు లోనైంది. గతేడాది కళ్యాణ్ దేవ్ - శ్రీజ జంట విడిపోయింది. అటు శ్రీజ నుంచి విడిపోయాక కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న శిరీష్ భరద్వాజ్ 2019లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు చెన్నైలో స్థిరపడినట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండే శిరీష్ భారతీయ జనతా పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు.

pawan kalyan alleged on Congress conspiracy behind Sreeja and sirish bharadwaj marriage

శిరీష్ హఠాన్మరణం నేపథ్యంలో శ్రీజతో ఆయన ప్రేమాయణం, వివాహం తదితర విషయాలపై నెటిజన్లు ఆన్‌లైన్‌లో జల్లెడ పడుతున్నారు. దీంతో పాత వీడియోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శ్రీజ ప్రేమ, పెళ్లి ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు. కుటుంబ పరువు ప్రతిష్టలను మంటగలుపుతూ శ్రీజ ఇంట్లో నుంచి వెళ్లిపోవడాన్ని పవర్‌స్టార్ జీర్ణించుకోలేకపోయారు. వివాహమయ్యే నాటికి శ్రీజకు 19 ఏళ్లు కాగా, శిరీష్‌కు 22 ఏళ్లు . వీరిద్దరూ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకుని అనంతరం ఢిల్లీకి వెళ్లి ఎక్కడో ఆశ్రయం పొందారు.

pawan kalyan alleged on Congress conspiracy behind Sreeja and sirish bharadwaj marriage

వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చి మెగా ఫ్యామిలీ నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పడం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంపై చిరంజీవి మౌనంగానే ఉండిపోగా.. పవన్ కళ్యాణ్ మాత్రం మీడియా ముందుకు వచ్చి తన దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉందని చూపించడం దుమారం రేపింది. తర్వాతి జరిగిన పరిణామాలతో పవన్ కళ్యాణ్ తన వద్ద ఉన్న 60 ఎంఎం రివాల్వర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులకు సరెండ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు షూటింగ్‌పై ఉన్న మక్కువ గురించి తెలిసి దానిని చిరంజీవి బహుమతిగా ఇచ్చారు. చెన్నై షూటింగ్ క్లబ్‌లో పవన్ సభ్యుడన్న సంగతి చాలా మందికి తెలియదు.

దాదాపు మూడు దశాబ్థాలకు పైగా టాలీవుడ్‌లో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన చిరంజీవి రాజకీయాల దిశగా సాగుతున్న దశలో శ్రీజ వ్యవహారం తెర మీదకు వచ్చింది. మెగాస్టార్‌ను మానసికంగా కృంగదీసి లబ్ధి పొందాలని కొందరు నేతలు శ్రీజ-శిరీష్‌లను తెలివిగా వాడుకున్నారనే ప్రచారం జరిగింది. ఆశ్రయం ఇచ్చే సాకుతో శ్రీజ దంపతుల జాడను గుట్టుగా ఉంచడంతో పాటు పక్కా పథకం ప్రకారం టీవీ ఛానెల్స్‌లో డిబేట్స్‌ ఏర్పాటు చేయించారని సినీ, రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపించాయి.

రోజులు గడిచాయి, శ్రీజ వివాహం ఆ సంగతిని జనం దాదాపుగా మరిచిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గుండెల్లో మాత్రం అది ఎప్పటికీ మానని గాయమే అయ్యింది. కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు చిరంజీవి కుటుంబ పరువు తీసేందుకు శ్రీజు ఇష్యూని వాడుకున్నారని పవన్ ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఆరోపించారు. తమ పరువును బజారుకీడ్చి ఢిల్లీలో రియాలిటీ షోలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తమకు నష్టం వస్తుందని భయంతో ఇంతకు ఒడిగట్టారని జనసేనాని ఆరోపించారు. శిరీష్ మరణం నేపథ్యంలో పవన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X