కళ్ల ముందే నలిగిపోతుంటే.. వీడియోలు తీయడం కాదు.. పవన్ కల్యాణ్ దిమ్మతిరిగే జవాబు

తెలుగు సినిమా పవర్ స్టార్ అలాగే తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా అని తెలిసిందే. కాగా ఇలా రెండు రంగాల్లో కూడా పవన్ ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. కాగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ సినిమాలు కాకుండా రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా బయట ఎక్కువ బిజీగా తిరుగుతూ కనిపిస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ పర్శనల్ లైఫ్ కి సంబంధించి చాలా మంచి చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు మెయిన్ గా ఆడవారి పట్ల కూడా పలు కామెంట్స్ సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజ జీవితంలో మాత్రం పవన్ మహిళల పట్ల కానీ వారిపై గౌరవం చూపించించడంలో కానీ పలు సందర్భాలు వారికి చెంప పెట్టు అన్నట్టుగా కనిపిస్తాయి.

Pawan Kalyan befitting Reply to Media Reporter on Women Safety in Andhra Pradesh

అయినా కూడా ఆ కొందరు పవన్ విషయంలో ట్రోల్స్, కామెంట్స్ ఆపారు. కాగా ఇపుడు పవన్ ఉన్నత హోదాలో ఉండడంతో ఏపీలో జరుగుతున్న పలు అసాంఘిక కార్యకలాపాల విషయంలో మాట్లాడాల్సిన భాద్యత మరింత పెరిగింది. దీనితో తాను మాట్లాడుతున్నారు కూడా. అయినప్పటికీ తనపై మరిన్ని ప్రశ్నలు వస్తుండగా లైవ్ లోనే పవన్ ఇచ్చిన సమాధానం ఇపుడు సోషల్ మీడియాలో అటెన్షన్ తెచ్చుకుంది.

ఓ బయట పవన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మహిళల రక్షణార్థం వారికి ఏమైనా ప్రత్యేక శిక్షణ లాంటివి ప్రభుత్వం తరపు నుంచి అందించొచ్చు కదా అనే ప్రశ్న తనకి ఎదురైంది. అయితే ఇక్కడే పవన్ చాకచక్యం కనిపించింది అని చెప్పాలి. ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలో ఎలాంటి ఇబ్బంది లేదు ఇది క్లియర్. కానీ పవన్ ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం మాత్రం అంతకు మించినట్టు ఉందని చెప్పాలి.

కాగా తాను ఏమన్నారంటే.. మహిళల రక్షణ అనేదాని కంటే మనం వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది కూడా మన ఆలోచన నుంచే మొదలు కావాలని చెప్పారు. అక్కడే ఉన్న చాలా మంది రిపోర్టర్స్ లో మహిళా రిపోర్టర్ కూడా ఉన్నారు. అంతమంది మగవారిలో ఆమె నలిగిపోతున్నారు.

Pawan Kalyan befitting Reply to Media Reporter on Women Safety in Andhra Pradesh

కానీ ఆమెకి కలుగుతున్న అసౌకర్యం కోసం మాత్రం మనకి ఆలోచన రాలేదు కానీ మిగతా ఆడవారికి వారి పరిరక్షణ కోసం మాట్లాడుతాం ముందు మార్పు మన ఆలోచన నుంచే రావాలి అని ఇచ్చిన సమాధానం రిపోర్టర్ సహా మిగతా వారి మైండ్ బ్లాక్ చేసినట్టు అయ్యింది అని చెప్పాలి. దీనితో ఈ స్టేట్మెంట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు కూడా నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ పవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా ఇలా తన వీడియో క్లిప్ అయితే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా పవన్ ప్రస్తుతం రెండు బరి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి దర్శకుడు జ్యోతి కృష్ణతో చేస్తున్న భారీ పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు కాగా మరో సినిమా దర్శకుడు సుజీత్ తో చేస్తున్న "ఓజి" చివరి దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X