వైఎస్ జగన్.. అయితే జర్మనీకి పో... డిప్యూటీ సీఎం మాస్ కౌంటర్!
ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి మంచి విజయాన్ని నేషనల్ లెవెల్లో మొత్తం తన వైపు చూసేలా మారిపోయారు ఇపుడు పవన్ కళ్యాణ్. కాగా దేశ ప్రధాని సైతం పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా మాట్లాడ్డం వంటివే పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా మార్చేశాయి.
కాగా ఇక్కడ నుంచ్ పవన్ కళ్యాణ్ లోకల్ టు నేషనల్ లెవెల్లో కూడా మోస్ట్ వాంటెడ్ గా మారగా తనపై ఏ చిన్న అంశం అయినా కూడా వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. కాగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏకంగా పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా విజయ బావుటా ఎగురవేసి 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ ని సెట్ చేసి రికార్డు సెట్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పాటు అయ్యి ప్రభుత్వాన్ని స్థాపించారు. వీరు ఏకంగా 160కి పైగా స్థానాలు సొంతం చేసుకుంటే వైఎస్ జగన్ తాలూకా వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకి పరిమితం అయ్యిపోయింది. కాగా అక్కడ నుంచే వైఎస్ జగన్ అండ్ కో అసెంబ్లీకి వెళ్లకుండా మళ్ళీ డుమ్మా కొట్టడం జరిగింది. గెలిచిన 11 మంది అయినా కూడా ప్రజలు గెలిపిస్తేనే కదా గెలిచారు.
అలాంటిది తమ నియోజకవర్గాలు కోసం కనీసం అసెంబ్లీలో మాట్లాడకపోతే ఎలా అనే విమర్శలు వీరిపై ఎక్కువ అయ్యాయి. అయితే దీనికి వారు తమకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని చెప్పడం అనేది హైలైట్ అయ్యింది. అసలు ప్రతిపక్ష హోదా రేంజ్ సీట్స్ రానప్పుడు ప్రతిపక్షం కూడా ఎలా అవుతారు అని పలు కామెంట్స్ లేకపోలేవు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, వై ఎస్ జగన్ నడుమ పాలిటిక్స్ ఒకింత ఆసక్తిగా ఉంటాయని చెప్పాలి.

పవన్ ని జగన్ ఎన్నో మార్లు వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పటికీ పవన్ అలా చేయలేదు. రాజకీయ పరంగానే విమర్శలు చేశారు. లేటెస్ట్ గా జగన్ కి వేసిన ఒక మైండ్ బ్లాకింగ్ కౌంటర్ వేయడం జరిగింది. వచ్చిన సీట్లు పరంగా కాకుండా తమకి వచ్చిన ఓట్ శాతం ప్రకారం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడంపై జగన్ కి ఫ్యూజ్ లు పోయే కౌంటర్ పవన్ వేయడం వైరల్ గా మారింది.
కాగా నేడు అసెంబ్లీ సమావేశం అయ్యాక జగన్ ప్రస్తావనపై నేను ఇటీవల జర్మనీలో జరిగిన ఎన్నికల ఫలితాలు చూశానని అక్కడ పలు పార్టీలకి వచ్చిన ఓట్ శాతంలో ఇంతమంది ఎంపీలు లాంటివి పంచుకోవడం ఉంటుంది. అందరికంటే తక్కువ వచ్చిన ఓట్ శాతాన్ని మిగతా పార్టీలు పంచుకుంటారు. మరి జగన్ కి కూడా ఇదే కావాలి అనుకుంటే మీరంతా కలిసి జర్మనీ వెళ్లిపోండి అంటూ రిప్లై ఇచ్చారు. దీనితో ఇది విన్న పవన్ ఫ్యాన్స్ నెటిజన్స్ ఫెళ్ళున నవ్వుకుంటున్నారు. ఒకోసారి పవన్ ఇచ్చే కౌంటర్లు మాత్రం మామూలుగా ఉండవు అంటూ ఈ క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











