ఉగ్రదాడి బాధిత కుటుంబానికి 50 లక్షలు .. గొప్ప మనసు చాటుకొన్న పవన్ కల్యాణ్

జమ్మూకాశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరు గాంచిన పహల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిందే. ఉగ్రవాదులు తెగబడిన ఈ ఘటనతో దేశ ప్రజలు రగిలిపోతున్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటను ఖండిస్తున్నారు. పాకిస్తాన్‌కు , ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం నేర్పించాలని.. భారత్ వైపు మరోసారి కన్నెత్తి చూడాలంటే వణికిపోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే యాక్షన్‌లోకి దిగిన కేంద్రం .. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నది.

పహల్గామ్ ఉగ్రదాడిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఘటన గురించి తెలిసిన తర్వాత బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా జనసేన పార్టీ మద్ధతు ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు తెలుగు వారు ప్రాణాలు కోల్పోవడంతో డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారిలో ఒకరు నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన రావు ఒకరు కాగా.. మరొకరు విశాఖ వాసి.

pawan kalyan donates rs 50 lakhs to somisetti madhusudhan rao family who killed in pahalgam terror attack

కాగా.. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు జనసేన పార్టీ సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగ్రదాడి బాధితులకు సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఉగ్రవాదులు ఐడీ కార్డులు చూసి, మతం పేరు అడిగి.. హిందువా? ముస్తిమా? అని తెలుసుకొని చంపడం దారుణమన్నారు పవన్. మతం అడితే మా వారిని చంపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నా కొందరు కుహానా సెక్యులర్ వాదులు లేదని మండిపడ్డారు.

26 మందిని మతం పేరుతో చంపినా కొంతమంది సెక్యులర్ వాదులు పాకిస్తాన్‌పై ప్రేమ చూపిస్తున్నారని.. అలాంటి వారు ఆ దేశానికే వెళ్లిపోవాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల్లో కొందరు పాకిస్తాన్‌పై జాలి చూపుతున్నారని మండిపడ్డారు. యుద్ధం జరిగినా, జరగకున్నా జాతీయ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాశ్మీర్ మనదేనని .. అక్కడ ఏమైనా జరిగితే మనకెందుకులే అని అనుకోకూడదని ఆయన హితవు పలికారు.

రిటైర్డ్ ఉద్యోగి చంద్రమౌళి కాశ్మీర్ అందాలు చూడటానికి వెళ్తే తూటాలతో ఆయన శరీరం ఛిద్రమైందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త అని.. ఆయన ఎవరికీ ఏ హానీ చేయలేదన్నారు. జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నా.. తమది జాతీయ విధానమని పవన్ పేర్కొన్నారు. అంతకుముందు మధుసూదన్‌రావు కుటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షల ఆర్ధిక సాయం అందజేసి తన పెద్ద మనసు చాటుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని , మధుసూదన్‌ భార్యాబిడ్డలను పవన్ ఓదార్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X