తెగేదాకా లాగకండి.. మా తెగింపు పదింతలు.. హోంశాఖ చేపట్టానంటే.. పవన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అత్యాచారాలు, చిన్నారులపై అఘాయిత్యాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆవేదనతో కూడిన హెచ్చరికలు చేశారు. చిన్నపిల్లలపై అత్యాచారం చేసే క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు. అలాంటి వారికి కఠిన శిక్ష విధించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పిఠాపురం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అత్యాచారాలకు పరిష్కారం ఏమిటని మహిళలు ప్రశ్నించగా.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన సభలో ప్రసంగిస్తూ..

ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణ ఏమిటి? అని ఓ మహిళ ప్రశ్నించగా.. ఐదేళ్ల పిల్లలకు పసిపిల్లలపై రేప్ చేసే నేరస్థులు, మూడేళ్ల పిల్లలపై మానభంగాలు చేసే నీచులు, దుర్మార్గులు, ఒకే ఇంటిలో దొంగతనానికి వచ్చిన ఇద్దరు ఇంట్లో వారిపై రేప్ చేయడం లాంటి సంఘటనలు ఎందుకు పెరిగాయి? అందుకు కారణం నేరస్థుల మనస్తత్వం, దుర్మార్గం, దానికి కులం, మతం, ప్రాంతం లేదు. ఇలాంటి సంఘటను ఒక ప్రభుత్వంలో పెరగడం ఎందుకంటే? గత వైసీపీ ప్రభుత్వం నుంచి నేర వారసత్వమే అని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan Emotional speech at Pithapuram meeting on Physical Abuse on Kids and Women

గత ప్రభుత్వ హయాంలో ఓ మాజీ ముఖ్యమంత్రి సతీమణిని అసెంబ్లీలో దూషించడం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రిని నిలదీస్తే.. నన్ను చంపేస్తానని ఒకడు. నా భార్యపై మానభంగం, నా చిన్న బిడ్డలను రేప్ చేస్తామనే సన్నాసులు మాట్లాడుతుంటే నాకు కోపం రాదా? అలాంటి హెచ్చరికలు చేస్తున్న వారిని పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు గానీ కట్టడి చేయలేదు. అందుకే ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా నేర సంస్కృతి పెరిగింది అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇలాంటి నేర సంస్కృతిని ఆపాలంటే బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలని చెప్పాలి. క్రిమినల్‌కు కుల, మతాలు ఉండవు. మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేస్తే కులాన్ని అడ్డుపెట్టుకొంటారా? ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాదు. భారత శిక్షాస్మృతి ఏం చెబుతున్నది? దానిని అమలు చేయరా? తెగేదాకా లాగకండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి.. తెగింపుకు అంతకు పదింతలు ఉంది. అధికారంలో ఉన్నాం కాబట్టి సహనం.. చేతకాక కాదు అని అధికారులను హెచ్చరించారు.

Pawan Kalyan Emotional speech at Pithapuram meeting on Physical Abuse on Kids and Women

తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించండి. కులాలు, మతాలను చూసి వదలివేయకండి. హోంమంత్రి అనిత గారికి ఒకటే చెబుతున్నాను. నేను పంచాయితీ రాజ్ మంత్రిని, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిని. మీరు హోంశాఖను సక్రమంగా నిర్వర్తించండి. నేను కనుక హోంశాఖను తీసుకొంటే.. పరిస్థితులు వేరేలా ఉంటాయి. అలసత్వం కొనసాగితే.. నేను హోం శాఖను తీసుకొంటాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

అత్యాచారాలు, మానభంగాలను కట్టడి చేయాలంటే సింగపూర్, దుబాయ్ తరహా చట్టాలను అమలు చేయాలి. నేను హోంశాఖ తీసుకొన్నానంటే..పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి. ఏపీలో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్‌మెంట్ ఉండాలి. మానవ హక్కులను కాపాడటానికే జనసేన ఉంది. ప్రజలకు అండగా ఉండటానికే దశాబ్దానికిపైగా అవమానాలు భరించాం. డిప్యూటీ సీఎం పదవి ఉండొచ్చు.. లేకపోవచ్చు. జనసేన ప్రజలకు అండగా ఉంటుంది అని స్పస్టం చేశారు.

More from Filmibeat

Read more about: pawan kalyan pithapuram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X