పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత విమర్శలు.. కవితపై భగ్గుమంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్
ఇప్పుడు ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అందరికీ బాగా అర్ధం అయ్యింది. తాను పాలిటిక్స్ లోకి వచ్చిన వెంటనే సక్సెస్ కాకపోయినప్పటికీ తాను ఎలాంటి గేమ్ ఛేంజర్ అనేది చంద్రబాబు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వారికి బాగా తెలుసు.
అందుకే పవన్ విషయంలో ఇపుడు వారు చాలా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కాగా ఇపుడు పవన్ కళ్యాణ్ పై నడుస్తున్న ఎన్నో రకాల వార్తల్లో పవన్ అభిమానులకి బాగా డిజప్పాయింటింగ్ గా అనిపించిన న్యూస్ ఒకటి ఉంది. కాగా పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కుటుంబీకులు కెసిఆర్ ఆలాగే తన కూతురు కల్వకుంట్ల కవిత గతంలో ఎన్నో సంచలన కామెంట్స్ చేశారు.

కవిత అయితే పవన్ ని కమెడియన్ అన్న రీతిలో కూడా చేసిన కామెంట్స్ ఉన్నాయి. కాగా ఆ మధ్య లిక్కర్ కేసులో ఇరుక్కొని జైలు నుంచి బయటకి వచ్చిన కవిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇపుడు పవన్ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యాయి.
కాగా పవన్ కళ్యాణ్ ని ఆమె ఒక సీరియస్ పొలిటీషియన్ గా పరిగణించడం లేదు అని చెప్పడం వైరల్ గా మారింది. అంతే కాకుండా అతడు ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదు ఏదో లక్ వల్ల వచ్చింది, పవన్ కి మెచ్యూరిటీ (పరిపక్వత) కూడా లేదు అన్నట్టుగా చెప్పడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
సరే ఇవి బాగానే ఉన్నాయి కానీ ఇతర రాజకీయ నాయకుల కోసం కవిత చెప్పిన మాటలు వింటే పవన్ విషయంలో ఆమెకి పర్శనల్ గా ద్వేషం ఉందా అన్నట్టు వ్యవహారం ఉంది. కాగా చంద్రబాబు అంటే ఒక డిగ్నిఫైడ్ లీడర్ అని నారా లోకేష్ అయితే మెచ్యూర్డ్ పొలిటీషియన్ (పరిపక్వత ఉన్న రాజకీయ నాయకుడు) అలాగే వై ఎస్ జగన్ ఒక ఫైటర్ అంటూ చెప్పారు.
ఇక్కడ అందరి విషయంలోని ఇంత పాజిటివ్ గా చెప్పి ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇలాంటి కామెంట్స్ చేయడం ఒకింత విడ్డురం అని చెప్పాలి. పవన్ ఇపుడు ఏ తరహాలో పనులు చేస్తున్నారో అందరికీ తెలుసు. ఎన్నో ఏళ్ల తరబడి వెనుకబడి ఉన్న ఏజెన్సీ ప్రాంతాలకి సైతం నీళ్లు, రోడ్లు వస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న పవన్ కే క్రెడిట్ దక్కుతుంది.
అయినప్పటికీ కవిత ఈ తరహా స్టేట్మెంట్ చేయడంతో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కవితపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కవిత పవన్ చేస్తున్న పనులు ఏంటి అనేవి తెలుసుకొని మాట్లాడాలి అని అంటున్నారు. మరి మొత్తానికి అయితే ఇపుడు మరోసారి కవిత పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన ఈ సంచలన కామెంట్స్ అటు రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో కూడా చర్చకి దారి తీస్తున్నాయి. కాగా పవన్ కళ్యాణ్ ఇపుడు తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కోసం సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











