Pawan Kalyan Vs Vijay: విజయ్ దూకుడు.. ఆ విషయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిరాశలో!

సినీ పరిశ్రమ నుంచి స్టార్స్ లేదా చిన్నపాటి నటీనటులు కూడా కొన్నాళ్ల స్టార్డం తర్వాత రాజకీయాల్లోకి వస్తూనే ఉంటారు. అయితే ఏ స్టార్ వారి సత్తాకి తగ్గట్టు ఎమ్మెల్యే గానో లేదా సొంత పార్టీనో పెట్టుకొని రాజకీయాల్లో తమకి ఎంతో ఫేమ్ ఇచ్చిన అభిమానులకి అలాగే ప్రజలకి ఎంతో కొంత చేయాలని రాజకీయాల్లోకి వస్తున్నామని చెబుతారు.

అలా ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటే ఇటీవల తమిళ నాట పవన్ లానే ఎంతో స్టార్డం ఉన్న విజయ్ దళపతి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే విజయ్ నార్మల్ గానే పార్టీ అనౌన్స్ చేసేసినప్పటికీ తన పార్టీ మొట్ట మొదటి సభని మాత్రం ఊహించని రీతిలో భారీ జన సందోహంతో తాను చేసాడు. దీనితో ఇక్కడ నుంచి ఆటోమాటిక్ గా పవన్ కళ్యాణ్ తో కలిపి పలు అంశాల్లో పోలికలు కూడా మొదలయ్యాయి.

Pawan Kalyan Fans disappointed over Vijay s Political Stragies and Decision Making

అలాగే ఇద్దరినీ పోలుస్తూ నేషనల్ మీడియా సైతం పవన్ నుంచి విజయ్ ఈ అంశాలు నేర్చుకోవాలి అంటూ పలు కథనాలు కూడా ప్రసారం చేశారు. కాగా ఇలా ఇద్దరూ కూడా తమ రాజకీయాల్లో బిజీగా ఉంటే అభిమానులు తమ పాలిటిక్స్ అలాగే సినిమాల కోసం కూడా మాట్లాడుకుంటున్నారు.

అయితే ఇన్ని రోజులు పవన్ ని చూసి విజయ్ నేర్చుకోవాలి అని వార్తలు వినిపిస్తే ఇపుడు విజయ్ నుంచి ఒక్క విషయం మాత్రం పవన్ నేర్చుకోవాలి అని తన అభిమానులు అనుకుంటున్నారు. ఐతే రాజకీయాల్లో ఇపుడు ఒకో పొలిటికల్ పార్టీకి ఒకో పార్టీ అంతకు మించే ఎక్కువ ఉన్నాయని తెలిసిందే. అలా పవన్ కళ్యాణ్ కి కూడా సెపరేట్ ఛానెల్ ఉంటే బాగుంటుంది అని అభిమానులు ఎప్పుడు నుంచో అనుకున్నారు.

ఇతర పార్టీ లకి సొంత ఛానెల్స్ ఉండడం మూలాన పవన్ కి ఇవి లేకపోవడం తనకి చాలా దెబ్బవుతోంది అని ఫ్యాన్స్ అప్పుడు నుంచే బాధ పడుతున్నారు. కానీ ఇన్నేళ్లు అయ్యినప్పటికీ పవన్ నుంచి చానల్ ఏదీ ఇంకా రాలేదు. కానీ మొన్ననే రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ దళపతి మాత్రం అప్పుడే తనకి సొంతంగా న్యూస్ ఛానెల్ కూడా పెట్టుకోనున్నట్టుగా తమిళ వర్గాలు అలాగే తన రాజకీయ పార్టీ శ్రేణుల నుంచే టాక్ వినిపిస్తుంది.

దీనితో ఇప్పుడిప్పుడే వచ్చిన విజయ్ కూడా అప్పుడే ఛానెల్ ని పెట్టుకునే ఆలోచనలో ఉన్నాడు అని పవన్ అభిమానులు ఈ విషయంలో డిజప్పాయింట్ అవుతున్నారు. మరి ఈ విషయంలో పవన్ విజయ్ నుంచి ఏమన్నా నేర్చుకుంటాడా అనేది చూడాలి.

ఇక ప్రస్తుతం సినిమాల పరంగా చూసినట్టు అయితే పవన్ కళ్యాణ్ రెండు భారీ సినిమాలు హరిహర వీరమల్లు అలాగే ఓజి సినిమాల షూటింగ్స్ ఫినిష్ చేయాల్సి ఉండగా అటు విజయ్ దళపతి తన కెరీర్ 69వ సినిమాని అలాగే దాదాపు తన కెరీర్ చివరి సినిమా ఇదే అన్నట్టుగా చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో పూజా హెగ్డే, మమిత బైజులు నటిస్తుండగా తమిళ దర్శకుడు హెచ్ వినోద్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X