హరిహర వీరమల్లుపై అంబటి ట్వీట్.. సుకన్య సమేతంగా చూడండి.. నెటిజన్ల ట్రోలింగ్
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం రూపొందించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అన్ని రకాలుగా సర్వసిద్దమైంది. జూలై 23వ తేదీ రాత్రి 9.30 గంటలకు విశ్వవ్యాప్తంగా ప్రీమియర్లతో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఈ సినిమా గురించి నెటిజన్లు, అభిమానులు, సినిమా ప్రేక్షకులు చూసేందుకు సిద్దమవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమయం సాకారమైంది. ఈ సినిమా గురించి వైసీపీ నేత అంబటి రాంబాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై నెటిజన్లు ఎలా స్పందించారంటే?
పవన్ కల్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్టై కనకవర్షం కురవాలని కోరుకొంటున్నాను అని ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్, నాగబాబుకు ట్యాగ్ చేశారు. అయితే ఆయన చేసిన ట్వీట్‌పై నెటిజన్లు, పవర్ స్టార్ అభిమానుల నుంచి ఆసక్తికరమైన కామెంట్స్ వెల్లువెత్తాయి. ఆయన నిజాయితీగా ట్వీట్ చేశాడా? సెటైర్ వేశాడా? అనే విషయంపై చర్చ జరిగింది.

అంబటి ట్వీట్‌పై అనుమానాలు వ్యక్తం చేసి.. సందేహాన్ని తీర్చుకొనేందుకు గ్రోక్‌ను సంప్రదించారు. ఇది ఆయన అఫీషియల్ పేజా? ప్రాంక్ పేజా? అని అడిగాడు. గతేడాది మహాకూటమి హిట్.. ఈ ఏడాది హరిహర వీరమల్లు హిట్. జగన్ననకు ఫటాఫట్ అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు. గత ప్రభుత్వంలో దాచుకొన్న జే బ్రాండ్ వేసావా? తాతా బ్రో.. నీ కనక వర్షం ట్వీట్ మీ తాడేపిల్లి, పేటియం శునకాలు చూస్తే ఉరేసుకొంటాయి అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
మీ పోస్ట్‌లోని వంకరితనం అర్ధం అవుతుంది. నాది కూడా ఒక కోరిక. 209 సంవత్సరంలో మీరు అధికారం తెచ్చుకొని మల్లా మీకు మంచి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకొంటున్నాను అని నెటిజన్ కామెంట్ చేశాడు. సినిమాల గురించి మాట్లాడుతున్నవంటే ఎంత భయమో అర్థం అయ్యింది. ఈ పాటి శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు మీద పెడితే బాగుండేది అందుకే ప్రజలు నిన్ను ఓడించి మూలాన కూర్చోపెట్టారు. నీకు బాధ్యత లేదు పార్టీకి నాయకుడికి భవిష్యత్ లేదు. 2029 ఎన్నికల తరువాత నువ్వు మాట్లాడవు అసలు లిక్కర్ కేసుతో అంతా సమాధి అని నెటిజన్ కామెంట్ చేశాడు.
లిక్కర్ స్కామ్ గానీ, ఇతర స్కామ్‌లో జలగ జైల్లోకి పోతే.. ఇతను కూడా జనసేనలోకి జంప్ అవుతాడేమో అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సార్ సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూ ఇవ్వడానికి మీరు ఉన్నారు కదా. ఎప్పటిలాగే.. అధికార పదవిలో ఉన్న కూడా మీరు చేసింది ఇదేగా. పవన్ కళ్యాణ్ జపం చేయలేకపోతే ఉండలేడు అసలు అంబటి రాంబాబు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నాడు.
హరి హర వీరమల్లు సినిమాను ఇది ఫ్లాప్ అయ్యేసినిమా అని వైసీపీ నేత పేర్ని నాని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అంబటి రాంబాబు.. సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. కనక వర్షం కురవాలి అని కోరుకుంటున్నానని అని స్టేట్మెంట్ ఇస్తున్నావు. మీ అంతరార్ధం ఏంటో? అని నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











