విజయసాయిరెడ్డి వివాదంపై నీతులా? పవన్ నాలుగో భార్య అంటూ జగన్ ఆరోపణలేంటీ.. పేర్నినానిపై ఫ్యాన్స్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి వివాదం మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత చర్చనీయాంశమవుతున్నది. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న శాంతి అధికారిణి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు దుమారం లేపాయి. తన భార్యతో విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉంది. నేను విదేశాల్లో ఉండగా.. నా భార్య బిడ్డను కన్నది. అందుకు కారణం ఆయనే అంటూ భర్త చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే ఈ వార్తను ప్రచారం చేసిన మీడియాపై వైసీపీ నేత పేర్ని నాని నీతులు చెప్పడంపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

గత రెండు రోజులుగా మదన్ మోహన్ ఆరోపణలపై స్పందిస్తూ భార్య శాంతి, ఎంపీ విజయ్ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా ఇలా బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరిస్తారు? అని ప్రశ్నించారు. అయితే వీరిద్దరి ప్రెస్ మీట్ తర్వాత పేర్ని నాని ఘాటుగా మీడియాపై స్పందించి నీతులు చెప్పే ప్రయత్నం చేశారు.

Pawan Kalyan Fans Trolling on Perni Nani over Supporting MP Vijaysai Reddy Controversy

ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంపై మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎంపీపై నిరాధారంగా ఓ కుల మీడియా వార్తలు ప్రసారం చేసింది. మదన్ మోహన్ ఆరోపణలపై వార్తను కొన్ని మీడియాలు ప్రసారం చేయడం తప్పేమీ లేదు. కానీ వాస్తవాలు లేకుండా మహిళా సంఘాల నేతలతో డిబేట్లు పెట్టించడం న్యాయమా? అని ప్రశ్నించారు.

అంతేకాకుండా పేర్ని నాని మాట్లాడుతూ.. ఎవరో ఒకరు ఆరోపణలు చేస్తే.. విజయసాయిరెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? వ్యక్తిత్వ హననం ఎంత వరకు కరెక్ట్ అని పేర్నినాని ఫైర్ అయ్యారు. ఏదైనా ఆధారాలు ఉంటే ఇలాంటి డిబేట్లు పెట్టడం సరైందే కానీ.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తారా? అని ప్రశ్నించాడు.

Pawan Kalyan Fans Trolling on Perni Nani over Supporting MP Vijaysai Reddy Controversy

అయితే ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి అంటూ స్వయానా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో ఆరోపణలు చేశారు. ఆయన ఎలాంటి ఆధారాలతో పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు? మీరు ఏ అధారాలతో విమర్శలు, ఆరోపణలు చేశారు అని ప్రశ్నిస్తున్నారు.

అలాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భార్యపై ఆరోపణలు చేసినప్పుడు పేర్ని నానికి ఇలాంటి నీతులు గుర్తుకు రాలేదా అని పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా ట్రోల్ చేస్తున్నారు. మీ పార్టీ వాళ్లకు ఓ నీతులు, అవతలి పార్టీ వాళ్లకు మరో నీతులా? అని తెగ ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X