పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎన్నాళ్ళు ఈ ఊడిగం అంటూ జన సైనికులు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరాధ్య దైవంగా కొలుచుకునే స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే హీరోగా పవన్ కళ్యాణ్ కి భారీ ఫాలోయింగ్ సొంతం కానీ ఇదే ఫాలోయింగ్ ని నమ్మి పవన్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తే మొదటి పదేళ్లు మాత్రం తాను ఎన్నో ఇబ్బందులు చూడాల్సి వచ్చింది.
కాగా సినిమాల్లో కూడా దాదాపు అంతే సంవత్సరాలు ఓటములు తాను చూసారు ఇదే కోవలో రాజకీయాల్లో కూడా చూసారు కానీ రాజకీయాల్లో తాను ఇపుడు సక్సెస్ అయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం పవన్ దారుణంగా తన అభిమానులని డిజప్పాయింట్ చేస్తున్నారని చెప్పక తప్పదు. తాను పార్టీ పెట్టి ఇన్నేళ్లకి ఎమ్మెల్యే అవ్వడమే కాకుండా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు.

సరే ఇదంతా బాగుంది కానీ అసలు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ తనకి ఉన్న స్టార్ దర్శక నటుల్లో కూడా అతన్ని సీఎం గా రానున్న రోజుల్లో చూడాలి అనుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా నేను పదవులు ఆశించను సేవలు మాత్రమే చేస్తాను అంటూ స్టేట్మెంట్ లు ఇచ్చుకుంటూ వెళ్లిపోతున్నారు. కానీ ఈ స్టేట్మెంట్స్ మూలాన తనని ఎంతగానో నమ్ముతున్న అభిమానులు మునిగిపోతున్నారు.
సరే పదవి అంటే వ్యామోహం లేదు అనుకుందాం కానీ మరొకరిని మోస్తాను మీ కింద పని చేస్తాను అని చెప్పడం లాంటివి ఇతర పార్టీల వారు చేస్తున్న జెండా కూలీ విమర్శలకి స్వయంగా పవన్ కళ్యాణ్ నే ప్రధాన కారణం కావడం అనేది ఫ్యాన్స్ కి తల కొట్టేసినట్టు అవుతుంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ ని వారు సీఎం గా చూడాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం నాకు చంద్రబాబు నాయుడే ఇంకో 15 ఏళ్ళు సీఎం గా ఉండాలి అని చెబుతున్నారు.
ఆయన మరో పదిహేనేళ్ళు సీఎం గా కొనసాగితే ఆయన అండర్ లో పని చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పడం తన అభిమానులకే ఇపుడు నచ్చడం లేదు. నిజానికి గత ఎన్నికల సమయంలోనే పొత్తు పెట్టుకున్నప్పటికీ సరైన సీట్లు కూడా పవన్ తీసుకోలేదని అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
సరే అది అప్పటికి అయ్యిపోయింది నెక్స్ట్ టర్మ్ లో అయినా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకుంటే తాను మాత్రం చంద్రబాబు కింద పని చేస్తాను ఆయనే ఇంకో పదిహేనేళ్ళు సీఎం అని చెప్తుండడం ఇపుడు పవన్ అభిమానులకే ఆగ్రహం తెప్పిస్తుంది.
ఒకప్పుడు ఎవరి పల్లకి నేను మోయను ఎవరికీ ఊడిగం చేయను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇపుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఇతర పార్టీల అభిమానులు చేస్తున్న కామెంట్స్ కి పవన్ ఫ్యాన్స్ సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి పవన్ ఎందుకిలా చేస్తున్నారో అభిమానుల మనోభావాలు అంటే గౌరవం ఉందా లేదా అనేది మాత్రం తనకే తెలియాల్సి ఉంది. పొత్తులో ఉన్నప్పటికీ కనీసం డిమాండ్ చేసుకోలేకపోవడంతో ప్రతిపక్షాల్లో కూడా గట్టి విమర్శలకి తావు ఇస్తుంది.


Click it and Unblock the Notifications











