పవన్ కల్యాణ్‌పై ఉత్తరాది ప్రజలు ఫిదా.. ‘పాకిస్థాన్’పై తిరుగుబాటుపై పవర్‌స్టార్‌కు జేజేలు!
తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోలు అనేకమంది ఉండొచ్చు కానీ వారిలో పాలిటిక్స్ లోకి కూడా వచ్చి సక్సెస్ అయ్యినవారు వారు మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. కాగా ఈ తక్కువ మందిలో కూడా సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన ఆనతి కాలంలోనే అధికారం చేపట్టారు కానీ మిగతా వారి పరిస్థితి మాత్రం అలా కాదు.
కాగా వీరిలో స్టార్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకి బాగా తెలుసు. అయితే ఈ కష్టాల తర్వాత ఎట్టకేలకి కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట గత ఏడాది 2024లో వినిపించింది.

కాగా అక్కడ నుంచి తనకి లైఫ్ ఇచ్చిన సినిమాలు పక్కన పెట్టేసి జనం కోసం పలు శాఖల్లో మంత్రిగా అలాగే ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా కూడా తన మార్క్ ఊహించని మార్పులు ఏపీలో తీసుకొస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ వెళుతున్నారు. కాగా ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమాలు లేకుండానే పాన్ ఇండియా లీడర్ గా మారిపోవడం కూడా జరిగింది.
ఇలా పవన్ సౌత్ నుంచి నార్త్ లీడర్ గా కూడా మారిపోయి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుండగా.. ఆ మధ్య సనాతన ధర్మం కోసం తీసుకున్న స్టాండ్ తో కూడా నార్త్ జనం పవన్ ని ప్రశంసల్లో ముంచెత్తారు. కాగా ఇపుడు మరోసారి నార్త్ ఆడియెన్స్ పవన్ కి సలాం కొడుతున్నారు. కాగా మరి అంతలా పవన్ ఏం చేసారో కూడా తెలిస్తే వారితో పాటుగా మన వాళ్ళు కూడా షాకవ్వాల్సిందే.

మరి మేటర్ ఏమిటంటే సనాతన ధర్మం కోసం పాటు పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఒక పాకిస్తాన్ కాలనీని భగీరథ కాలనీగా మార్చరట. అయితే ఇందులో మరింత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఈ పాకిస్తాన్ కాలనీ అనేది ఎక్కడో కూడా కాదు ఏపీ లోనే అది కూడా విజయవాడలో ఉందట. దీనితో ఇన్నేళ్ల కాలంలో అది కూడా తెలుగు రాష్ట్రంలో పాకిస్తాన్ కాలనీ పేరుతో ఇప్పటికీ ఒక ప్రాంతం ఉందా అని చాలా మంది షాకవుతున్నారు.
మరి ఎట్టకేలకి మళ్ళీ మన హిందూ భారతదేశంలో ఇప్పటికీ ఉన్న పాకిస్తాన్ అనే కాలనీని పవన్ భగీరథ కాలనీగా మార్చడంతో పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్ చూసి నార్త్ నెటిజన్స్ అలాగే హిందువులు మనవళ్ల కంటే ఎక్కువ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనితో మరోసారి పవన్ పై మంచి ప్రశంసలు వస్తున్నాయి.
ఇక ఇదిలా ఉండగా పవన్ మళ్ళీ ఉత్తరభారతదేశానికి స్టార్ కాంపైనర్ గా వెళ్ళబోతున్నారు. రీసెంట్ గానే మహారాష్ట్ర, పూణేలో పవన్ బీజేపీ తరపున ప్రచారానికి వెళితే అన్ని స్థానాల్లో కూడా బీజేపీ నెగ్గింది. ఇక ఇపుడు మళ్ళీ పవన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి అక్కడ తనకి ఎలాంటి వెల్కమ్ దక్కుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











