Top 10: ప్రధాని మోదీ తర్వాత పవన్ కల్యాణే.. ధోని, కోహ్లీ దాటేసిన పవర్ స్టార్
పాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ తెచ్చుకోవాలని ఇపుడు దాదాపు అన్ని సినీ పరిశ్రమలకి చెందిన హీరోలు కూడా తెగ కష్టపడుతున్నారు. కాగా తెలుగులో నుంచి పాన్ ఇండియా లెవెల్లోకి అనేకమంది హీరోలు ఇపుడు ఎంటర్ అయ్యారు కానీ పాన్ ఇండియా ఆడియెన్స్ లో సినిమాల పరంగా కాకుండా పొలిటికల్ పరంగా భారీ రీచ్ అందుకుని ఏకైక తెలుగు హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
కాగా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అనే ట్యాగ్ ని తీసేసుకున్న తర్వాత తాను నిజంగా పవర్ లోకి రావడంతో మళ్ళీ పవర్ స్టార్ అని అభిమానులు గర్వంగా పిలుచుకుంటున్నారు. కాగా ఇపుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రెండో పవర్ఫుల్ వ్యక్తిగా కనిపిస్తున్నారు.

ఇక పవన్ మేనియా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వైడ్ మెయిన్ గా నార్త్ లో కూడా గట్టిగా ఉందని ఆ మధ్య బీజేపీకి నార్త్ లో ప్రచారం చేసినపుడు వచ్చిన భారీ జన సందోహం చూసి తెలుగు రాష్ట్రాల పవన్ అభిమానులు సైతం ఆశ్చర్యచకితులు అయ్యారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ ని కొట్టే మరో హీరో లేరు అనే మాట పూర్తిగా వాస్తవం.
కానీ ఇపుడు పవన్ క్రేజ్ ఇండియా లెవెల్లో టాప్ లో ఉండడం గమనార్హం. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (X) లో గత మార్చ్ టాప్ 10 ట్రెండ్స్ లిస్ట్ బయటకి వచ్చింది. గత మార్చ్ నెల మొత్తంలో ఇండియా వైడ్ గా అత్యధికంగా మాట్లాడుకున్న ప్రముఖ వ్యక్తులలో పవన్ కళ్యాణ్ టాప్ 5వ స్థానంలో నిలవడం విశేషం కాగా.
పవన్ కళ్యాణ్ పలువురు టాప్ క్రికెటర్స్ ఎం ఎస్ ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ ఇలా నార్త్ లో ఎంతో ఆదరణ ఉన్న పవర్ఫుల్ పర్సనాలిటీస్ తర్వాత అత్యధికంగా మాట్లాడుకున్న పర్సనాలిటీగా నిలిచారు. ఇక ఇండియా వైడ్ గా అత్యధికంగా మాట్లాడుకున్న టాప్ పొలిటీషియన్స్ లో అయితే పవన్ వేరే లెవెల్ అని చెప్పక తప్పదు. ఇందులో అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ టాప్ 2 లో నిలిచారు.
టాప్ 1 లో ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నెంబర్ 1 లో ఉంటే మోడీ తర్వాత నెంబర్ 2 స్థానంలో పవన్ కళ్యాణే నిలవడం అనేది గమనార్హం. దీనితో ఇలా ఇండియన్ ఛార్ట్స్ లో పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో గత మార్చి నెలకి గాను మారు మోగింది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి మూడు సినిమాలు రానుండగా వాటిలో రెండు హరిహర వీరమల్లు, ఓజి చిత్రాలు దాదాపు పూర్తయ్యాయి. అలాగే వీరమల్లు సినిమా అయితే ఈ మే 9న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











