OG షూటింగ్‌కు వెళ్తే క్యాజీ అని నిలదీస్తారు... సినిమాలపై పిఠాపురంలో పవన్ కల్యాణ్ క్లారిటీ
పిఠాపురంలో పవన్ కల్యాణ్ సీరియస్ విషయాలపై మాట్లాడుతుంటే.. అభిమానులు OG.. OG..OG.. అంటూ అరిచారు. అయితే తనకు వారు ఏమంటున్నారో.. అర్ధం కాకపోవడంతో పక్కన ఉన్న వారిని అడిగి తెలుసుకొన్నారు. వారు చెప్పిన విషయాలు విని ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. సినిమాలు, షూటింగుల గురించి ఆయన చెప్పిన విషయం ఏమిటంటే..
OG సినిమానా? అని పవన్ అనగానే.. ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ప్రస్తుతం సినిమాలు తీసే సమయం ఉందా? మీకు మాట ఇచ్చాను కాబట్టి.. మూడు నెలలు సినిమా షూటింగులు పెట్టుకొను. ఆంధ్రాలో రోడ్డు వేసిన తర్వాత.. గుంతలు పూడ్చిన తర్వాత షూటింగులకు వెళ్తాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత రోడ్లు వేయలేదని తిట్టకూడదు కదా.. కొత్త రోడ్లు కాకున్నా.. పాత రోడ్లు రిపేర్ చేయాలి. లేకపోతే మిమ్మల్ని ఎన్నుకొంటే.. ఓజీ అంటూ సినిమా షూటింగులకు వెళ్తారా? అని అంటారు. ఓజీ సినిమా షూటింగ్‌కు వెళ్తే క్యాజీ (ఇదేం పని) అని నిలదీస్తారు అని పవన్ కల్యాణ్ పన్నీగా సమాధానం చెప్పారు.
ఆంధ్రా అభివృద్ది చేయకుండా వెళ్తే బాగుండదు. మా నిర్మాతలకు కూడా చెప్పాను. క్షమించాలి. మా ఆంధ్ర రాజ్య ప్రజలకు సేవ చేసి.. మీకు వారంలో రెండు రోజులు షూటింగ్ చేస్తాను అని చెప్పాను. ఓజీ సినిమా బాగుంటుంది. మీరు చూద్దురు అని పవన్ కల్యాణ్ అభిమానులకు షుషారెత్తించారు.


Click it and Unblock the Notifications











