పొట్ట చెక్కలయ్యేలా నవ్విన పవన్ కల్యాణ్.. పవర్‌స్టార్‌ను నవ్వించిన ఆ మహిళ ఎవరంటే?

సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. పాలిటిక్స్‌లో రాణిస్తారా? అంటూ అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లందరికి తన పనితీరుతో జవాబు చెబుతున్నారు. ఏ రాజకీయ నాయకుడికి లేని కమిట్‌మెంట్, పట్టుదలతో ప్రజా సంక్షేమానికి నడుం బిగించినట్టు ఆయన చేస్తున్న కార్యక్రమాలు, సమీక్షలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఏపీలో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ వివరాల్లోకి వెళితే..

అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విరామం లేకుండా ఆ శాఖ ద్వారా ప్రజలకు పర్యావరణ పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులతో సమీక్షలు జరుపుతూ.. అవినీతీ బాగోతాన్ని బయట పెడుతూ.. ఆ శాఖను ప్రక్షాళన చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకొంటున్నారు.

Pawan Kalyan Goes heavy laugh amid Women Speech praising Chandrababu Naidu at Vana Mahotsavam

ఏపీలో ఘనంగా వనమహోత్సవాన్ని ప్రారంభించారు. చెట్టు ఇంటికి పెద్ద కొడుకు లాంటింది. ఇంటిలో చెట్టు నాటితే పది మంది కొడుకులతో సమానాం అని అన్నారు. కాబట్టి ప్రతీ మనిషి ఓ మొక్క నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు, చెట్ల, అటవీ సంపద వల్ల ప్రజలకు ఎలాంటి మేరు జరుగుతుందో అనే విషయాన్ని క్షుణ్ణంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి ఓ సభలో పాల్గొన్నారు.

Pawan Kalyan Goes heavy laugh amid Women Speech praising Chandrababu Naidu at Vana Mahotsavam

అయితే ఈ సభలో స్థానిక మహిళ చేసిన ప్రసంగం అందర్నీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది. గుర్తు తెలియని మహిళ స్వచ్ఛమైన తెలుగు భాషలో ప్రాసతో చంద్రబాబును కీర్తించిన తీరు విన్న వారందరూ ఫుల్లుగా నవ్వుల్లో మునిగిపోయారు. ఆమె నిజాయితీగా, ఎలాంటి అరమరికలు లేకుండా ప్రశంసించిన తీరే అందర్నీ నవ్వించిందనే ఆ వీడియో చూస్తే అర్ధమవుతుంది.

Pawan Kalyan Goes heavy laugh amid Women Speech praising Chandrababu Naidu at Vana Mahotsavam

అయితే సభలో స్టేజ్ మీద కూర్చొన్న పవన్ కల్యాణ్ మాత్రం ఆమె మాట్లాడినంత సేపు కడుపు పట్టుకొని నవ్వారు. ఆగకుండా నవ్వడంతో ఓ దశలో ఆయన కళ్లలో నీళ్ల కూడా తిరిగాయి. అలానే నవ్వుతూనే కళ్లను తుడుచుకొంటూ కనిపించారు. పక్కనే ఉన్న కేంద్ర మంత్రి కూడా విపరీతంగా నవ్వించారు. చివరకు గంభీరంగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన నవ్వును ఆపుకోలేక పడిపడి నవ్వారు.

సభలో మాట్లాడిన మహిళ ఎవరో వీడియో కనిపించలేదు. కానీ ఆమె మాత్రం తెలుగు భాషపై పట్టుతో క్యాడర్, లీడర్, బడుగులు ప్లీడర్, బలహీనుల గాడ్ ఫాదర్ అంటూ ఆమె చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకొన్నది. ఆ స్పీచ్ మీరు కూడా వినండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X