నరేంద్రమోదీ సీక్రెట్ పేరు లీక్ చేసిన పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం మాటలకు ప్రధాని రియాక్షన్ చూశారా?

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకి చెందిన పలువురు స్టార్ హీరోలు రాజకీయాల్లో ఏ రీతిలో బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాలు అలాగే తమిళ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయ్ దళపతిల ప్రభావం ఎంతైనా ఇపుడు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక పదేళ్ల కష్టం తర్వాత ఒక ఉన్నత స్థాయిలోకి రావడం జరిగింది.

కాగా ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక్క స్టేట్ పాలిటిక్స్ లోనే కాకుండా నేషనల్ పాలిటిక్స్ లో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో దేశంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తి ప్రధాని మోడీకి బాగా తెలుసు అనేందుకు ఎన్నో సందర్భాలు కనిపించాయి.

Pawan Kalyan

కాగా అది 2014 లో అలయన్స్ నుంచే చూసుకున్నా మొన్న 2024 లో పవన్ ప్రమాణ స్వీకారం వరకు కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మోడీ ఇస్తున్న ఎలివేషన్లు ఎన్ని KGF లు OG లు వచ్చేలా ఉన్నా కూడా ఇవ్వని రేంజ్ లో మోడీ ఇస్తున్నారు. కాగా ఇద్దరి నడుమ ఉన్న సాన్నిహిత్యం కూడా అంతా ఇంతా కాదు. మరి తాజాగా ఏపీలో జరిగిన అమరావతి పునః ప్రారంభం సమయంలో మోడీని పవన్ కళ్యాణ్ తన స్పీచ్ తో షాక్ కి లోను చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

కాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన స్పీచ్ లో మోడీ కోసం దాదాపు ఎవరికీ తెలియని కొత్త పేరుని కొన్ని విషయాలు తెలిపారు. కాగా మోడీ ఒకప్పుడు సన్యాసం ఆశ్రమంలో ఉండేవారు అని అక్కడ వారు తనకి 'అనికేత్' అనే పేరు పెట్టారు అని చెప్పగానే మోడీ ఒక్కసారిగా ఏటో చూస్తున్న దృష్టిని పవన్ స్పీచ్ ఇస్తున్న వైపు తిప్పేశారు. అలా చిన్నగా చిరు నవ్వు నవ్వుతు ఈ విషయం పవన్ కి ఎలా తెలుసు అనే రీతిలో చూసారు.

దీనితో ఈ షాకింగ్ రియాక్షన్ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ప్రధాని మోడీకి ఇలాంటి ఒక సీక్రెట్ పేరు ఉన్నట్టుగా గూగుల్ ని అడిగినా సరైన సమాధానం లేదు. అలాంటి సీక్రెట్ ని పవన్ కళ్యాణ్ రివీల్ చేయడం అనేది మోడీకి సైతం ఒకింత చిన్నగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలా పవన్ కళ్యాణ్ స్పీచ్ పూర్తి అయ్యి తన కుర్చీ దగ్గరికి వెళ్లి కూర్చున్నాక మోడీ తన సెక్యూరిటీతో పవన్ ని పిలిపించి చేతికి ఏదో చిన్న వస్తువు కూడా ఇచ్చారు.

దీనితో ఈ ఇద్దరి నడుమ జరిగిన ఈ కొద్ది పాటి కన్వర్జేషన్ ఒకింత ఆశ్చర్యకరంగా మారింది అని చెప్పాలి. ఇక ఇవి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజి అనే భారీ సినిమాలు చేస్తుండగా వీటిలో వీరమల్లు సినిమా అతి త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X