అంబానీ పెళ్లిలో జనసేన విజయంపై చర్చ.. 100 శాతం ఎలా సాధ్యం? నేతల ఆరా.. పవన్ జవాబు ఏమిటో తెలుసా?
డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత సొంత రాష్ట్రంలోనే బిజీగా మారిన జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా ముంబైలో చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా జరిగిన ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లికి హాజరయ్యారు. వారాహి దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్ పసుపు పచ్చ దుస్తులు ధరించి.. మెడచుట్టూ పసుపు కండువా ధరించి ఓ యోగిలా కనిపించారు. వైభవంగా జరిగిన పెళ్లిలో జనసేన విజయం గురించి అందరూ ప్రశంసించిన విషయాన్ని తాజాగా పార్టీ ఆఫీసులో జరిగిన ఆత్మీయ సత్కార సభ సందర్భంగా పంచుకొన్నారు.
అనంత్ అంబానీ పెళ్లిలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. చంద్రబాబు నాయుడుతో కలిసి దేశ రాజకీయ నేతలను కలిశారు. ముఖేష్, నీతా అంబానీ స్వయంగా పవన్‌కు స్వాగతం పలికారు. అలా ముంబైలో పవన్ కల్యాణ్‌కు విపరీతమైన క్రేజ్ కనిపించింది.

ఇక పవన్ కల్యాణ్ వెనుక రాంచరణ్, ఉపాసన కొణిదెల కూడా ఉండటం మరింత స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. పవన్ వెంట రాంచరణ్, ఉపాసన నడిచి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. బాబాయ్, అబ్బాయ్ కాంబినేషన్ ముంబైలో క్రేజీగా మారింది.
ఇలాంటి ట్రెండ్స్ మధ్య ముంబైలో జరిగిన విషయాలను పవన్ కల్యాణ్ పంచుకొంటూ.. ముఖేష్ అంబానీ కుమారుడి వివాహానికి వెళ్లిన సమయంలో దేశంలోని అగ్ర పారిశ్రామిక వేత్తలు, నేతలు, సెలబ్రిటీలందరూ జనసేన ఘనవిజయం.. 100 శాతం స్ట్రైకింగ్ రేట్ గురించే ఆసక్తిగా అడిగి ప్రశంసలు గుప్పించారు. ఎలా సాధ్యపడిందని అడిగితే చాలా గొప్పగా అనిపించింది అని పవన్ కల్యాణ్ తెలిపారు.

జనసేన విజయం 5 కోట్ల ఆంధ్రులు పెట్టుకొన్న నమ్మకం. ప్రజలు మనపై పెట్టిన గురుతర భాధ్యత. ఆ విషయాన్ని మరువొద్దు. ఆ నమ్మకాన్ని పక్కాగా నెరవేర్చాలి. 5 క్రితం ఓటమి తర్వాత ఎన్నో దెబ్బలు తట్టుకుని ఇంతదూరం ప్రయాణించడం సాధారణ విషయం కాదు. మరొకరైతే పార్టీని అప్పుడే వదిలేసేవారన్నారు. వైసీపీ 11 సీట్లకే పరిమితమై.. అసెంబ్లీకే రాకుండా పోయారు అని సైటైర్ వేశారు.


Click it and Unblock the Notifications











