అంతలా దిగజారలేదు.. వైఎస్ జగన్‌ను సుతిమెత్తగా ఏకిపారేసిన పవన్ కల్యాణ్.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో సెటైర్లు!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలయికలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొన్న చిత్రం గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ తదితరులు నటిచంిన ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో జనవరి 5వ తేదీన (శనివారం) రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఘనంగా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనదైన శైలిలో వైసీపీ నేత వైఎస్ జగన్‌పై సుతిమెత్తగా నిప్పులు చెరిగారు. పవన్ స్పీచ్ వివరాల్లోకి వెళితే..

గత వైసీపీ ప్రభుత్వ హాయంలో తెలుగు సినీ పరిశ్రమ అనేక వివాదాల్లో కూరుకుపోయింది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు వ్యవహారం పెద్ద దుమారమే లేపింది. వకీల్ సాబ్ సినిమాకు టికెట్ రేట్లను తగ్గించడం అత్యంత వివాదాస్పదమైంది. అలాగే పలు సినిమాలకు టికెట్లు పెంచకుండా అప్పటి ప్రభుత్వం తీవ్రమైన ఆంక్షల్ని విధించింది. గత ప్రభుత్వ హయాంలో అధికారుల నిర్ణయాలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాయి.

Pawan Kalyan satires on YS Jagan at Game Changer Pre Release Event

టికెట్ల రేట్ల పెంపు, అలాగే సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందించాలని చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, ప్రభాస్, ఇతర సినీ ప్రముఖులు అప్పటి సీఎంతో భేటీ అయిన సమావేశం మరో వివాదంగా మారింది. చిరంజీవితోసహా పలువురు సినీ ప్రముఖులను అగౌరపరిచారనే విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ వివాదంపై పవన్ కల్యాణ్ బహిరంగంగానే తన సభల్లో విమర్శలు గుప్పించారు.

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్‌కు హాజరైన పవన్ కల్యాణ్ మరోసారి పరోక్షంగా గత ప్రభుత్వంపై, వైఎస్ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. సినిమాను సినిమాలా చూడండి. టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ టికెట్ మీద జీఎస్టీ ఉంటుంది. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాకు ఇష్టం ఉండదు. అన్ని ఇండస్ట్రీల వ్యక్తులు కలిసి సినిమాల్ని చేస్తున్నారు అని అన్నారు.

Pawan Kalyan satires on YS Jagan at Game Changer Pre Release Event

తెలుగు సినిమా స్థాయి పెరిగింది. అందుకనుగుణంగా టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దాని వల్ల 18 శాతం జీఎస్టీ వస్తుంది. అది ప్రభుత్వానికి ఆదాయంగా మారుతుంది. బ్లాక్ టికెట్లు అమ్మడం వల్ల ఆ డబ్బు ఎవరికో వెళ్లిపోతుంది. నా భీమ్లా నాయన్ సినిమాకు టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించారు. కొంత మంది యాక్టర్లు కూటమికి మద్దతు తెలియజేయలేదు. కానీ మేము వివక్ష చూపించలేదు అని అన్నారు.

సినిమా టికెట్ పెంపు కోసం హీరోలు రావాల్సిన పనిలేదు. నిర్మాతలు, ట్రేడ్ వర్గాలు వస్తే చాలూ. హీరోలు వచ్చిన మాకు నమస్కరాలు పెట్టాల్సిన అవసరం లేదు. మేము అంత దిగజారలేదు. ఉన్నత విలువలను స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి నేర్చుకొన్నాం. తనకు వ్యతిరేకంగా సినిమాలు తీసినా కృష్ణ, కోట శ్రీనివాసరావును అప్యాయంగా పలకరించారు. అదే సిని పరిశ్రమ ఔన్నత్యం. దానిని కొనసాగిస్తున్నాం. చిరంజీవి, ప్రభాస్, మహేష్ లాంటి హీరోలు వచ్చి మా వద్ద చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు అని పవన్ కల్యాణ్ పరోక్షంగా జగన్‌పై విమర్శలు చేసినప్పుడు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X