అందుకే వారికి 11 సీట్లు.. వైసీపీ సభ్యులు పారిపోయారు.. సుతిమెత్తగా జగన్‌కు పవన్ కల్యాణ్ చురకలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైసీపీపై భగ్గమనేలా వ్యవహరించిన పవన్ కల్యాణ్.. అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తర్వాత హుందాగా ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా చాలా సుతిమెత్తగా చురకలు అంటిస్తూ ఉన్నత విలువలు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

గత ప్రభుత్వంలో సభ జరిగిన తీరు చాలా దారుణంగా ఉండేది. అలాంటి పార్టీ 11 సీట్లకే పరిమితం అయ్యారు. వారు ఈ సభలో లేరు. వారికి ఓటమిని ఎదుర్కునే ధైర్యం లేదు. వారు పారిపోయారు. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష విద్వేషం రేపడానికి కాదు.. మనషులను కలపడానికి.. భాష సమస్యలను పరిష్కరించడానికి. ఎంతటి జటిలమైన భయంకర సమస్యైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ వారు భాషతోని రాష్ట్ర పురోగాభివృద్ధిని ఆపేసారు.

Pawan Kalyan satires on YS Jagan Mohan Reddy Government in AP Assembly

అలా సభ కాకుండా చంద్రబాబు చెప్పినట్టు.. ఈ సభ భవిష్యత్‌కు ప్రమాణంగా నిలువాలి. మనం వేసే ప్రతీ అడుగు భవిష్యత్ తరాలకు గీటురాయిగా ఉండిపోవాలి. ఈ రోజున సభలో ఉన్న ప్రతీ సభ్యుడు.. చట్టాలు చేయడానికి. చట్టాలు ఉల్లంఘించడానికి కాదు. విబేధించడమంటే ద్వేషించడం కాదు.. వాదించడమంటే కొట్టుకోవడం కాదు. విభేధించడం, వాదించడం ప్రజాస్వామ్యానికి మౌళికమైన పునాదులు.

ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్బావం వెనుక ప్రధాన ధ్యేయం భాషా ప్రయుక్త రాష్ట్రాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగింది. ఆయన 56 రోజులు తిండి తిప్పలు లేకుండా నరకం అనుభవిస్తూ బలైపోయారు. ఆయన మరణానికి చేరువై భోజనం చేయకుండా ఉన్న ప్రతీ రోజు మనకు ఒకటిన్నర సంవత్సరంగా భావించాలి.

Pawan Kalyan satires on YS Jagan Mohan Reddy Government in AP Assembly

పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి. వాదోపవాదనలు హద్దులు దాటకుండా ఉండాలి. వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా.. గత ప్రభుత్వం మాదిరిగా తిట్లు, బూతులకు వాడితే.. పొట్టి శ్రీరాములు త్యాగానికి అవమానించడమే అవుతుంది. ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త పొట్టి శ్రీరాములు స్పూర్తిగా సభలో సత్ సంప్రదాయాలు నెలకొల్పాలి.

ఈ విలువైన ఐదేళ్లు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా. అన్నం పెట్టే రైతు, కౌలు రౌతులు, కూలీలకు అండగా, మహిళలకు, ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అద్బుతంగా అభివృద్ది చెందేలా చర్చలు జరిగాలి. అవి మీ ఆధ్వర్యంలోనే సాగాలి అని పవన్ కల్యాణ్ ఆకాక్షించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X