వైఎస్ జగన్ ప్రభుత్వ ఓటమికి దిల్ రాజు పరోక్ష సహకారామా?.. పవన్ కామెంట్స్ వైరల్!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర అపారమైన జనాదరణ ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. కాగా పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఎలాంటి కష్టాలు చూసారో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా పవన్ కళ్యాణ్ ఇలా స్ట్రగుల్స్ నడుమ రాజకీయాల్లో సక్సెస్ అయ్యి ఫైనల్ గా ఏపీ డిప్యూటీ సీఎం అయ్యి ఆ పదవికి వన్నె తీసుకొచ్చారు.

ఇక సినిమా పరంగా తాను సూపర్ సక్సెస్ కావాల్సి ఉంది. కాగా ఇపుడు పవన్ చేతిలో మూడు సినిమాలు ఉంటే ఆ సినిమాలు అన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇక ఇవి పక్కన పెడితే పవన్ లేటెస్ట్ గా తన కుటుంబ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సంచలన ప్రాజెక్ట్ చిత్రం "గేమ్ ఛేంజర్" భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమండ్రిలో హాజరు అయ్యారు.

pawan kalyan saved by dil raju but he satires directly in game changer

కాగా ఈ ఈవెంట్ లో పవన్ పలు షాకింగ్ ఫాక్ట్ కి చెప్పడం చర్చకి దారి తీసింది. ఆ సినిమా నిర్మాత దిల్ రాజు కోసం చేసిన పలు కీలక కామెంట్స్ ఆసక్తిగా మారాయని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ ఆర్ధిక పరిస్థితి కోసం అందరికీ తెలియనిది కాదు. తన కెరీర్ స్టార్టింగ్ లో సినిమాలు కాకుండా పవన్ వేరే ఇతర బ్రాండ్స్ కి వర్క్ చేశారు సో అలా ఆదాయం వచ్చేది కానీ తర్వాత అవి కూడా ఆపేసి పూర్తిగా సినిమాల మీద వచ్చే డబ్బు తోనే తన లైఫ్ ని సాగిస్తున్నారు.

అయితే తాను 2014లో పార్టీ పెట్టి 2018లో సినిమాలకి స్వస్తి చెప్పేసారు. కానీ 2019లో తాను ఘోరంగా ఓడిపోవడంతో చేతిలో అధికారం కూడా కనీసం ఎమ్మెల్యే కూడా కాకపోవడంతో పవన్ పరిస్ధితి మళ్ళీ మొదటికే వచ్చింది. దీనితో తనకి ఉన్న ఏకైక జీవన ఆధారం సినిమాలోకి వచ్చారు. కాగా తాను ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ముందుకొచ్చి వకీల్ సాబ్ సినిమా కోసం దిల్ రాజు అడ్వాన్స్ ఇవ్వకుంటే నేడు జనసేన పార్టీ ఇక్కడి వచ్చేది కాదు అని పవన్ తెలిపారు.

అలాగే తనకి అప్పుడు మార్కెట్ ఉందో లేదో కూడా అర్ధం కాని సమయంలో దిల్ రాజు అందించిన చేయూత చాలా ప్లస్ అయ్యింది అంటూ తనని ఓ రేంజ్ లో పొగిడేశారు. కానీ ఈ పొగడ్తల తర్వాత దిల్ రాజుకి సున్నితంగా చురకలు కూడా పవన్ అంటించడం జరిగింది. కాగా తాను మాట్లాడుతూ ఏపీలో కూడా చిత్ర పరిశ్రమని విస్తరించాలి అని దిల్ రాజుకి చెప్పారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ మీరే కదా ఏపీలో కూడా చూడాలి అంటే దిల్ రాజు ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్ళు అంటూ మాట్లాడితే ఇలాంటివి నేను నమ్మను అని స్టేజి మీదే పవన్ చెప్పేయడం అక్కడ ఫన్ గానే అనిపించినా దిల్ రాజు క్యాజువల్ గానే ఆ మాట అక్కడికి అన్నారని పవన్ కి కూడా అర్ధం అయ్యే టక్కున నమ్మను అని చెప్పేసారు. దీనితో తన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

అయితే వకీల్ సాబ్ సినిమాకు పవన్ కల్యాణ్‌కు రెమ్యునరేషన్ ఇచ్చి పరోక్షంగా వైసీపీ పరాజయానికి కారణమయ్యాడా? అని సినీ, రాజకీయ వర్గాలు చర్చించుకొంటున్నారు. దిల్ రాజు ఇచ్చిన భారీ రెమ్యునరేషన్‌ వల్లే పవన్ పార్టీని సమర్ధంగా నడిపి.. 100 శాతం స్ట్రైక్ రేటును సాధించారని చర్చ జరుగుతున్నది.

More from Filmibeat

Read more about: pawan kalyan dil raju ys jagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X