వైసీపీ గుండా పార్టీని ఎదిరించా.. భయపడే సమస్యే లేదు... పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్!

సినీ నటుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన నేతలకు, పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన హెచ్చరికలు, సలహాలు, సూచనలను ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి ఒత్తిడులకు తలవొగ్గను. ఎలాంటి వార్నింగ్‌లను సహించను. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడితే సహించలేను అని అన్నారు.

దయచేసి పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడవద్దు. అలాంటి పనులతో నాకు తలనొప్పులు తీసుకు రావొద్దు. ఎందుకంటే నా రక్త సంబంధాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. జనం కోసమైతే నా కుటుంబాన్ని కూడా పక్కనపెట్టేస్తాను. ప్రజల కోసం నా సొంత బిడ్డలను కూడా పక్కన పెట్టేయగలను. ప్రజా స్వామ్యం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను నిస్వార్ధంగా పనిచేస్తాను అని పవన్ కల్యాణ్ తన కార్యకర్తలకు, నేతలకు స్పష్టం చేశారు.

Pawan Kalyan Sensational Speech about Hereditary and Legacy politics at Jana Sena Meeting

కొందరికి గొంతెమ్మ కోరికలకు సపోర్ట్ చేయడం లేదని నన్ను తిట్టేస్తే భయపడిపోతానని, నేను లేకపోతే పంచాయితీ ఎన్నికల్లో గెలవం. మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని అంటే సంతోషమే. కానీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తే నేను దెబ్బ తినడానికి సిద్దమే కానీ రాజీ పడే సమస్యే లేదు అని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఎన్నికల్లో ఓడిపోతే నాకు ఏం పోతుంది. ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు. అన్ని గెలవకపోతే ఇబ్బంది ఏమీ లేదు. ఫలితాలు మరోలా వచ్చినా ఇలానే ఉండేవాళ్లం. నాయకులందరికి నా విన్నపం ఒకటే. దయచేసి కుటుంబంలో ఉండే వ్యక్తులు సహాయకారిగా ఉంటే నాకు ఇబ్బంది లేదు. కానీ వాళ్లే నా వారసులు అంటే నేను ఒప్పుకొను. ఎందుకంటే రాజకీయాల్లో కొత్తదనం ఎక్కడ నుంచి వస్తుంది అని పవన్ కల్యాణ్ నిలదీశాడు.

నేను కూడా నా పిల్లలను రాజకీయాల్లో ప్రమోట్ చేస్తే సరికాదు. సహజంగా ఎదగాలి. అలా వస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాను. కానీ నేతల పిల్లలు స్వతహాగా ఎదిగి ప్రజల మనసులు గెలుచుకొనే నాకు అభ్యంతరం లేదు. అలాంటి వారిని నేను ప్రోత్సహిస్తాను అని అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు రౌడీయిజాన్ని నమ్ముకోవద్దు. మన పార్టీలో ఉండే సున్నితమైన నేతలను తిట్టడం చేస్తే.. నేను సహించను. వారితో నాకు ఎలాంటి భయాలు లేవు. వైసీపీ లాంటి గుండా పార్టీని ఎదుర్కొని వచ్చాను. మీరు నన్ను బెదిరించగలరా? దానిని మీరు ఆలోచించాలి. మాటల్లో సంస్కారం ఉండాలి. సోషల్ మీడియాలో మన నేతలను మన నాయకులే తిడితే వారిని వదులుకోవడానికి సిద్దం. వాళ్లు నాకు అత్యంత నమ్మకమైన నేతలైనా సరే నేను సహించను అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

More from Filmibeat

Read more about: pawan kalyan janasena ys jagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X