Pawan Kalyan: ఫ్యాన్స్ కి పవన్ కల్యాణ్ వార్నింగ్.. ఓవరాక్షన్‌పై ఇచ్చి పడేసిన డిప్యూటీ సీఎం
తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి ఎన్నో ఏళ్ళు నుంచి ఇదే ఫ్యాన్ బేస్ ని కొనసాగిస్తూ వస్తున్న పవన్ కోసం అభిమానులు ఎంత దూరం అయినా వెళ్తారు. అయితే పవన్ కి తన అభిమానుల విషయంలో పెద్దగా కంప్లైంట్స్ ఉండవు కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం పవన్ ని పదే పదే ఇబ్బంది పెడుతూ వస్తుంటారు.
ఇదే పవన్ కి ఇతర అభిమానులకి కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంది. కాగా పవన్ సినిమాల్లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చేసారు. కాగా అక్కడ నుంచి తన పొలిటికల్ మీటింగ్ ఏదన్నా బయట జరిగింది అంటే లక్షలాది మంది అభిమానులు తన వెంట వచ్చేవారు. అయితే ఈ భారీ జన సందోహాన్ని చూసి పవన్ తన మొదటి ఎన్నికల్లో ఏదో అయిపోతా అనుకుని పొరబడ్డారు.

చివరికి చేసి అదే అభిమానులు చాలా మంది తనకి ఓట్ వెయ్యలేదు అంటూ పవన్ వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్టార్స్ లో అక్కడ ఫ్యాన్స్ ని ఇక్కడ ఓటర్స్ గా మార్చుకునే అవసరం ఎంతైనా ఉంది కానీ కొందరు మాత్రం రాజకీయ విషయాల్లో కూడా సినిమాల ప్రస్తావన పదే పదే తెస్తూ వస్తున్నారు.
ఇది ఒకటి రెండు సార్లు అంటే పర్లేదు కానీ పవన్ విషయంలో మాత్రం పదే పదే జరుగుతుంది. దీనితో పవన్ కూడా చాలా విసుగెత్తిపోయాడు. కాగా లేటెస్ట్ ఓ పొలిటికల్ సభ లో కూడా పవన్ ని మాట్లాడనివ్వకుండా తన సినిమా ఓజి, ఓజి అంటూ అరుస్తున్నారు. దీనితో పవన్ వారికి స్మూత్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది.

నా సినిమాల కోసం మీరు అరిస్తే ఏమి రాదని ఆ దేవుణ్ణి అయినా అన్ని సార్లు కలవరిస్తే కనీసం మీకు పుణ్యం అయినా దక్కుతుంది అంటూ అత్యుత్సాహం కనబరిచిన అభిమానులకి చురకలు అంటించాడు. అయితే అభిమానానికి ఎలాంటి అవధులు ఉండవు కానీ వారి అభిమానానికి ఒక అర్ధం కూడా ఉందని ఫ్యాన్స్ తనకి చూపించాలి. అప్పుడు ఏ హీరోకి అయినా తన అభిమానుల మీద గౌరవం ఏర్పడుతుంది.
అంతే కానీ సమయం సందర్భం ఏది చూడకుండా వెర్రిగా చూపించే అభిమానం మాత్రం రహితమే అని చెప్పొచ్చు. మరి దీనిని మాత్రం పవన్ ఫ్యాన్స్ లో ఓ కొంతమంది ఎప్పటికి గ్రహిస్తారో ఏంటో.. ఇక ఇవి పక్కన పెడితే పవన్ రాజకీయాలు సహా సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. కొన్ని రోజులు కితమే భారీ సినిమా "హరిహర వీరమల్లు" షూటింగ్ లో పాల్గొనగా ఈ సినిమా సహా దర్శకుడు సుజీత్ తో చేస్తున్న "ఓజి" షూటింగ్ లో కూడా పవన్ జాయిన్ కానున్నాడు. ఈ రెండు నెలల్లోపు ఈ షూటింగ్స్ పూర్తి కానున్నట్టుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











