రోజాకు పవన్ కల్యాణ్ దిమ్మతిరిగే కౌంటర్ .. గేట్లు బద్దలు కొట్టుకొని అంటూ!

పిఠాపురంలో అసెంబ్లీ స్థానంలో ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్.. తనకు సంచలన విజయం అదించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం భావోద్వేగం, ఆవేశం, ఉత్సాహంతో సాగింది. ఆయన ఈ సభలో మాట్లాడుతూ..

పదవి ఇవ్వకపోతే సేవకుడిలా పనిచేస్తాను. పదవి ఇస్తే బాధ్యతగా పనిచేస్తానని అనుకొన్నాను. నాకు జయం తెలియదు.. అపజయం తెలియదు. మీరు సీఎం అని అరిస్తే.. అది నిజమైంది. పదవి ఉన్నా రాజాగా ఉన్నా.. పదవి లేకున్నా రాజాగా ఉన్నా అని ఉత్సాహంగా ప్రసంగించారు. ఘన విజయాన్ని అందించిన మీకు రుణగ్రస్తుడిని అన్నారు.

Pawan Kalyan strong Counter to YSRCP Roja at Pithapuram Meeting

ఏ రాజ్యాంగం రాసింది.. గుండెపై పచ్చబొట్టు పొడిపించుకోమన్నది. ఏ రాజ్యాంగం రాసింది.. ఓ చెల్లి అన్నా.. ఓ తల్లి కొడుకా అని పిలిపించేలా చేసింది. రాజ్యాగం ఇచ్చిన పదవిని గౌరవిస్తాను. కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని మాత్రం చివరి శ్వాస వరకు ఉంచుకొంటాను అని పవన్ కల్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు.

Pawan Kalyan strong Counter to YSRCP Roja at Pithapuram Meeting

పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నాను. ఆ స్థలంలో ఇళ్లు కడుతాను. పార్టీ క్యాంప్ ఆఫీస్ కడుతాను. ప్రజలంతా నా క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి చాలా మాట్లాడుకొనేలా ఉండాలి. విశాల స్థలంలో ప్రజలంతా వచ్చి చర్చలు జరపాలి. ఆ స్థాయిలో నా ఇల్లు, క్యాంప్ ఆఫీస్ ఉంటుంది అని పవన్ కల్యాణ్ అన్నారు.

కొందరు మనల్ని అనరాని మాటలు అన్నారు. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగుపెడుతావని ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీ గేట్స్ కూడా తాకలేవు అన్నారు. వాటిని నేను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ మీరు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకొని నాకు ఘన విజయాన్ని అందించారు.

Pawan Kalyan strong Counter to YSRCP Roja at Pithapuram Meeting

అయితే పెద్దలు ఎస్‌వీఎస్ఎన్ వర్మ గారు వారికి గట్టిగా సమాధానం చెప్పారు. పవన్ కల్యాణ్ గేట్లు బద్దలు కొట్టుకొని వస్తారు అని బల్లగుద్ది చెప్పారు. వారి మాటనే నిజమైంది. పిఠాపురం అభివృద్దికి కట్టుబడి ఉంటాను. కన్నీరు తుడవని పదవి నాకు వద్దు. మీ సేవకు కట్టుబడి ఉన్నాను అని పవన్ కల్యాణ్ ఆవేశంగా చెప్పారు.

More from Filmibeat

Read more about: pawan kalyan rk roja pithapuram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X