వైసీపీ 18000 కోట్ల అవినీతి.. సభ నుంచి తప్పించుకొని పారిపోయారు.. వైఎస్ జగన్‌పై పవన్ కల్యాణ్ మాస్ బ్యాటింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘాటైన ప్రసంగాన్ని చేశారు. గత ప్రభుత్వ అవినీతిని సాక్షాలతో సహా బయటపెట్టి.. ఇలాంటి వారిని క్షమిస్తే.. తప్పు చేసిన వదిలేస్తే ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండదు అని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం జనసేనాని స్పీచ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంత్రి పదవి చేపట్టిన తర్వాత నా పరిధిలో ఉన్న శాఖల పనితీరును సమీక్షించాను. గత ప్రభుత్వం గురించి ఆరోపణలు చేయడం వారిపై పగ ప్రతీకారం కాదు. ప్రతీ పక్షంలో ఉన్న గత ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రిని స్వేచ్చగా వదిలేయకూడదు. వారి చేసిన అక్రమాలకు వారు జవాబుదారీతనంగా ఉండాలి. కానీ వారు తప్పించుకొని పారిపోయారు అని పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు.

ప్రభుత్వ ఉద్యోగి 20 వేల రూపాయల లంచం తీసుకొంటే రకరకాల శిక్షలు, దర్యాప్తు సంఘాల విచారణలు ఉన్నాయనే విషయం నా దృష్టికి వచ్చింది. చిన్నపాటి లంచం తీసుకొన్న ఉద్యోగిపై ఏసీబీ, ఇతర సంస్థల విచారణ కొనసాగుతున్నది. అయితే రాష్ట్ర ఖజానాకు 18 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అందుకు గత ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సభ్యులు బాధ్యులైతే వారు ఎలా శిక్ష నుంచి ఎలా తప్పించుకొంటారు. వారికి తప్పకుండా శిక్ష పడాల్సిందే అని అసెంబ్లీలో ఘాటుగా స్పందించారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభలో లేకుండా తప్పించుకొని పోయారు. వారు ఉంటే ఈ రోజు అవినీతి భాగోతంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండేది. అందుకే వాళ్లు సభలో లేకుండా తప్పించుకొని పారిపోయారు. వీటన్నిటికి వారిని జవాబుదారీగా ఉండేలా చేయాలి. తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలి అని పవన్ కల్యాణ్ స్పీకర్‌కు సూచించారు.

స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అవినీతి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. వారిని వదిలిపెట్టొద్దు. తప్పకుండా శిక్ష పడాలి. చిన్నపాటి ఉద్యోగులకు శిక్ష వేసి.. పెద్దలను వదిలేస్తే.. నైతికంగా కరెక్ట్ కాదు. రేపటి రోజున కానిస్టేబుల్ కానీ.. మరే ఉద్యోగిని పట్టుకొంటే.. పెద్దల్ని వదిలేస్తారు కానీ మమల్ని పట్టుకొంటారా? అని విమర్శిస్తారు అని పవన్ కల్యాణ్ అన్నారు.
తప్పు చేసిన వాళ్లను వదిలేస్తే.. పాలన, ప్రభుత్వం పర్యవేక్షణ, అధికారంపై ప్రజల నమ్మకం, బలం పోతుంది. తప్పు చేసిన వారు ఎవరైనా సరే.. వదిలిపెట్టకూడదు. వారిని కఠినంగా శిక్షిస్తే.. పారదర్శక పాలనను మనం అందించామనే నమ్మకం ప్రజలకు కలుగుతుంది. అప్పుడే ప్రభుత్వ జవాబుదారీతనంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది అని పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో తెలిపారు.


Click it and Unblock the Notifications











