పవన్ కల్యాణ్ నోట అల్లు అర్జున్ పేరు.. ఏ హీరోతో నాకు విభేదాలు లేవంటూ కామెంట్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమా పరిశ్రమలోని హీరోలందరూ బాగుండాలని ఆకాక్షించారు. ఏపీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టే పనులకు పల్లె పండుగ పేరుతో పంచాయతీ వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు. పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండల పరిధిలోని పునాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని సి.హెచ్.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ప్రారంభించి పనులకు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ వివరాల్లోకి వెళితే..
అయితే ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు, కార్యకర్తలు OG.. OG అంటూ గట్టిగా అరిచారు. అయితే మీరు అలా అనడంలో ఎలాంటి తప్పులేదు. కానీ మీరు ఓజీ ఓజీ అంటుంటే.. నాకు చాలా రోజు మరో విధంగా వినిపించేది. మీరు ఓజీ అంటే నాకు మోడీ అని వినిపించేది అంటూ పవర్ స్టార్ నవ్వుతూ వెల్లడించారు.

సినిమాలు చూడాలంటే మీ వద్ద డబ్బులు ఉండాలి. అందుకోసం పని కావాలి. పని ఉంటే సినిమా చూడటానికి డబ్బులు వస్తాయి. నన్ను హీరోగానే కాకుండా నాయకుడిగా ఎలా అభిమానిస్తారో.. నాక్కూడా అలాంటి అభిమానం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోతోనూ నాకు ఇబ్బంది లేదు. ప్రతీ ఒక్కరు బాగుండాలని కోరుకొంటాను అని పవన్ కల్యాణ్ అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, నాని గారు కావొచ్చు.. అందరూ హీరోలు బాగుండాలని కోరుకొంటాను. మీ అభిమాన హీరోలకు జై కొట్టాలంటే రాష్ట్ర ఆర్తిక వ్యవస్త బాగుండాలి. ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టాలి. మీకు స్కిల్ డెవలప్‌మెంట్ కావాలని నేను కోరుకొంటున్నాను. ఆ తర్వాత విందులు, వినోదాలు జరుపుకొందాం అని పవన్ కల్యాణ్ చెప్పారు.

దాంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు పవన్ కల్యాణ్ ముగింపు పలికే ప్రయత్నం కనిపించింది. గతంలో అల్లు అర్జున్ వైసీపీ నేతకు సపోర్టు చేసినా.. తనకేమి పట్టింపు లేదనే ధొరణితో మాట్లాడారు. సినిమా హీరోలు అందరూ బాగుండాలి అనే విధంగా మాట్లాడటంతో అందరూ హీరోలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇక పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, OG చిత్రాలు షూటింగులు పూర్తి చేసుకొనే పనిలో ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమాను మార్చి 28వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేశారు.ఆ తర్వాత OG సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











