రుషికొండను ప్రత్యర్థులు చెక్కినట్టు..అలా గుండు కొట్టేస్తారు.. అసెంబ్లీలో స్పీచ్‌తో అదరగొట్టిన పవన్ కల్యాణ్
జనసేన పార్టీ ఆవిర్బావం అనంతరం 13 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారి అసెంబ్లీకి అడుగుపెట్టాడు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ. తెలుగుదేశం పార్టీలతో పొత్తు కుదుర్చుకొని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా వైఎస్ జగన్ సర్కారును చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా జనసేనకు రికార్డు స్థాయి సీట్లును వచ్చేలా కృషి చేశారు. తాజా ప్రభుత్వంలో స్పీకర్‌గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడుకి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలో మాట్లాడుతూ సభ్యులను నవ్వుల్లో ముంచెత్తారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
16వ శాసన సభకు ఏకగ్రీవంగా ఎన్నికనై సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి శుభాభివందనాలు. నేను మొదటిసారి అసెంబ్లీకి అడుగుపెట్టడం. మీలాంటి సుదీర్గ రాజకీయ అనుభవం.. దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా సేవలు అందించిన మీరు పంచాయితీరాజ్ లాంటి మంతిత్ర్వ శాఖలను నిర్వహించిన అనుభవం ఉంది. అలాంటి మీరు స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

మీకు కోపం వస్తే.. రుషికొండను ప్రత్యర్థులు చెక్కినట్టు మీరు ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. నాకు ఒకటే బాధగా ఉంది. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ సభలో ఎవరైనా తిట్టడం మొదలుపెడితే.. మీరే మైక్ ఆఫ్ చేయాలి. ఆ బాధ్యత మీ చేతిలో ఉంది. మిమ్మల్ని స్పీకర్‌గా చూస్తే.. స్కూల్‌లో అల్లరి చేసే విద్యార్థిని క్లాస్ లీడర్ చేసినట్టు ఉంది. కానీ ఇప్పటి వరకు మీ కోపాన్ని చూసిన ప్రజలకు.. మీ హుందాతనాన్ని చూసే అవకాశం కలిగింది అని పవన్ కల్యాణ్ అన్నారు.

చర్చ పేరుతో వివిధ రకాలుగా మీడియాలో సంస్కార హీనంగా బూతులు, భాష మాట్లాడే విధానాన్ని నియంత్రణ మీ నుంచే మొదలు కావాలి. సభా నాయకుడు చంద్రబాబు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మహిళలు, ఆడబిడ్డలు చాలా నలిగిపోయారని అన్నారు. చిన్న, పెద్ద లేకుండా కొందరు వ్యక్తిగతంగా దూషిస్తూ...వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారు. అలాంటి నికృష్ణ చర్యలు మీ ద్వారా ఆగిపోవాలి అని పవన్ కల్యాణ్ అన్నారు.

అయ్యన్నపాత్రుడి మనసత్వాన్ని, ఆయన సుదీర్ఘ అనుభవం గురించి మాట్లాడుతూనే.. ఆయనలోని సమర్ధతను కొనియాడారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నంత సేపు సభ్యులందరూ ఆసక్తిగా ఆయన వేపే చూస్తూ కను రెప్ప వేయకుండా కూడా వింటూ ఉండిపోయారు. తొలి చర్చలతోనే పవన్ తన మాట తీరు, విజన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.


Click it and Unblock the Notifications











