పవన్ కల్యాణ్‌పై ఇంటెలిజెన్స్ నిఘా.. ప్రధాని మోదీ ఆదేశాలతో..!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలో హాట్ టాపిక్ గ్గా మారారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలపైనా తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ తెలియపరుస్తూనే ఉన్నారు. పదేళ్ల కింద జనసేన పార్టీని స్థాపించి ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు, ఊహించని సవాళ్లను ఎదుర్కొని పొలిటికల్ గేమ్ లో విజయం సాధించారు. ఏపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ అత్యధిక విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో కాకుండా 2024లో పక్కా వ్యూహాలతో పార్టీని ముందుకు నడిపించి విజయకేతనం ఎగరేశారు.
అయితే, దేశంలోనే పవన్ కళ్యాణ్ పార్టీ వందకు వందశాతం స్టైక్ రేట్ సాధించి రికార్డ్ సెట్ చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు. ఒక్క స్థానంలో గెలిచినా పెద్ద ఫలితం లేకుండాపోయింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసి 21 స్థానాల నుంచి పోటీ చేసి 21కి 21కి గెలుపొందారు. అది కూడా మెజార్టీ ఓట్లతో గెలుపొందడం సక్సెస్ కు చిరునామాగా మారింది. అలాగే 2 ఎంపీ స్థానాలను, మరోవైపు రెండు ఎమ్మెల్సీ సీట్లను కూడా పవన్ కళ్యాణ్ పార్టీ దక్కించుకుంది. వందకు వందకు శాతం స్ట్రైక్ రేట్ సాధించి తొలి పార్టీగానూ జనసేనా పార్టీ రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇదే స్థాయిలో ప్రభంజనం సృష్టించింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిన సంగతి తెలిసిందే. ప్రజా సేవలో పవర్ స్టార్ మునిగిపోయారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రజలకు అన్నీ విధాలుగా అండదండగా ఉంటున్నారు. మరోవైపు ప్రత్యేకమైన స్కీమ్స్ రూపొందిస్తూ అర్హులకు లబ్ధి చేకూరుతున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ బెస్ట్ డిప్యూటీ సీఎంగానూ పేరు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీలతోనూ పవన్ కళ్యాణ్ స్నేహపూర్వకంగానే ఉంటున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీతో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ ఎంత సన్నిహితంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోదీ కూడా పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక ప్రేమ చూపిస్తుంటారు. పలు వేదికలపైనా పవన్ కళ్యాణ్ 'తుఫాన్' లాంటోడని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భవ సభను పెద్దఎత్తున నిర్వహించారు. దీంతో ఏపీ, తెలంగాణ నుంచి లక్షలాదిగా అభిమానులు, జనం ఆ సభకు తరలివెళ్లారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈ సభ జరిగింది. దాదాపు 57 ఎకరాల్లో ఈ సభను నిర్వహించడం విశేషం. లక్షలాదిగా జనం తరలిరావడంతో సభ విజయవంతమైంది.
కాగా, పవన్ కళ్యాణ్ గతంలో పార్టీని సరిగా నడిపించడం లేదు అనే విమర్శల నుంచి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. విజయకేతనమే అనే స్థాయికి వచ్చారు. ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేట్ తోపాటు ఓ ప్రధాన పార్టీని అన్నట్టుగానే ఎన్నికల్లో అతఃపాతాళానికి తొక్కడం, రీసెంట్ గా చిత్రాడలో నిర్వహించిన సభ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ప్రశాంతంగా జరగడం. పవన్ ప్రసంగాన్ని అందరూ శ్రద్ధగా వినడం ఢిల్లీ పవర్ హౌజ్ లో హాట్ టాపిక్ గ్గా మారింది.
దీంతో పవన్ కళ్యాణ్ సభ సక్సెస్ పై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఇదెలా సాధ్యమైందనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా ఉంచాలని, తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారంట. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. ప్రధానినే పవన్ కళ్యాణ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గ్గా మారింది.


Click it and Unblock the Notifications











