కడుపన్నా చేయాలి? ముద్దున్న పెట్టాలి.. బాలయ్యను జైల్లో పెట్టారా? తూ అంటూ ఉమ్మేసిన పోసాని
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ వారి ఫ్యామిలీ మెంబర్స్‌పై విమర్శలు చేసిన వారిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటికే పలువురు వైసీపీ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ తన అరెస్ట్ గురించి వార్తలు ప్రసారం చేయడంపై నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీ ఘాటుగా స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
నేను ఉన్నత చదువులు చదువుకొన్నాను. నాకు డబ్బుపై ఆశ ఉంటే రాజకీయాల్లోకి నేను ఎందుకు వెళ్తాను. సినిమాల్లో అవకాశాలు రావడం లేదని బాధపడటం లేదు. నేను జగన్‌కు సపోర్టు చేస్తే సినిమా అవకాశాలు రావని నాకు తెలియదా? చిరంజీవిని తిడితే నేను అందర్నీ నిలదీశాను. అలాంటి నేను మెగా ఫ్యామిలీని తిడుతానా? పవన్ కల్యాణ్ నేను తిట్టానా? ఏనాడైనా నన్ను మెగా ఫ్యామిలీ తిట్టారా? నేను ఏనాడైనా వాళ్ల అమ్మను ఏనాడైనా తిట్టానా? నా ఫ్యామిలీని తిడితే.. నీ అమ్మను తిట్టకుండా ఉండను అని పవన్ కల్యాణ్‌ను హెచ్చరించానని పోసాని చెప్పారు.

నాకు సంస్కారం ఉంది. మంచి ఉంటే మంచి దగ్గరికి వెళ్తాను. చెడు ఉంటే నేను ఆ వైపు వెళ్లను. నాపై టీవీ5 అవాస్తవాలు ప్రచారం చేస్తున్నది. అందుకే నేను ప్రశ్నిస్తున్నాను. నేను పార్టీలు మారానని కామెంట్ చేస్తుంటే.. మీకు ఒప్పుకోను. చిరంజీవి కోరిక మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. పవన్ కల్యాణ్ నా వద్దకు వచ్చి మీరు పోటీ చేయాలని చెబితే.. వారిపై ఉన్న గౌరవంతో పోటీ చేశాను అని పోసాని అన్నారు.
మహిళలను కించపరిచే వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి ఇస్తారా? అని పోసాని ప్రశ్నించారు. నాకు నంది అవార్డు వస్తే.. ఇవి నంది అవార్డులు కాదు.. కమ్మ అవార్డులు అని నా అవార్డును వెనక్కి తిరిగి ఇచ్చాను కుక్కా అంటూ టీటీడీ చైర్మన్‌ను దూషించారు. అయితే నా గురించి పవన్ కల్యాణ్‌కు తెలుసు. నేను ఎలా ఉంటానో.. ఎలా మాట్లాడుతానో ఆయన గ్రహించాలి అని అన్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌కు ఒకటే విన్నపం. ప్రజలను కించపరిచే విధంగా వార్తలు ప్రసారం చేసే బీఆర్ నాయుడిని నమ్మకండి అని పోసాని అన్నారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అదే జరిగితే మీకు ప్రజలు మరోసారి అధికారం ఇస్తారు. మీరు మంచి చేయాలని నేను కోరుకొంటాను అని పోసాని అన్నాడు.
అమ్మాయిని ముద్దైనా పెట్టుకోవాలి.. లేదా కడుపైనా చేయాలి అంటూ బాలకృష్ణ కామెంట్ చేశాడు. థూ అనే విధంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇద్దరిపై కాల్చులు జరిపారు. వారు చావుకు దగ్గరయ్యారు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారా? నీచమైన కామెంట్లు చేసిన బాలకృష్ణ గురించి ఏనాడైనా మీ ఛానెల్‌లో వేశారా? ఒక్కరోజైనా జైల్లో పెట్టారా? అంటూ ప్రముఖ టీవీ ఛానెల్‌పై మండిపడ్డారు. బాలకృష్ణను అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేయండి అని పోసాని కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











