పవన్ కల్యాణ్‌కు కలిసి వచ్చిన 212 నెంబర్ .. మురిసిపోతున్న ఫ్యాన్స్

సినీనటులు, రాజకీయ నాయకులు వారి పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌‌లోనూ సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఏ పనిచేయాలన్నా, కనీసం గడప దాటాలన్నా.. ఎంతో ఆలోచించి, అందరినీ సంప్రదించి కానీ మొదలుపెట్టారు. ఎందుకంటే సినీ, రాజకీయ రంగాలు సక్సెస్ వెంటపడతాయి కాబట్టి. ఒక్క ఫ్లాప్ ఎదురైనా, ఒక ఎన్నికలో ఓడిపోయినా అంతే సంగతులు. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టరు. మానవ ప్రయత్నానికి తోడు దైవబలం ఉండాలని భావించేవారు ఎందరో.

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం వెనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి ఎంతో ఉంది. తను కూడా పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ , ప్రత్యర్ధుల విమర్శలకు చెక్ పెడుతూ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కూటమిని గెలుపు మెట్లెక్కించడంతో పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడానికి కూడా పవనే కారణం. టీడీపీతో పొత్తు వద్దంటే వద్దు అని భీష్మించుకుని కూర్చొన్న మోడీ అండ్ కోను ఒప్పించి కూటమి దిశగా అడుగులు వేయించింది పవన్ కళ్యాణే. ఆ రోజున జనసేనాని ప్రతిపాదనకు మోడీ పరివార్ నో చెప్పి ఉంటే మూడోసారి అధికారం దక్కేదే కాదు. ఈ విషయాన్ని గుర్తించారు కనుకే ప్రధాని మోడీ ఫలితాల తర్వాత పవన్‌‌ను ఆకాశానికెత్తేస్తున్నారు.

power star fans and janasena activists happy for AP Govt allocates room no 212 in secretariat for Dy cm pawan kalyan Check Details Here

ఎన్నికల్లో గెలవడంతో పాటు ఈసారి పాలనలోనూ భాగస్వామి కావాలని పవన్ కళ్యాణ్ భావించారు. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పోస్ట్‌తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను పొందారు. ఇప్పటి వరకు విపక్షనేతగా పోరాడిన పవన్.. ఇకపై పాలకుడిగా తన మార్క్ చూపించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొత్త మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎల్లుండి పగ్గాలు అందుకోనున్నారు.

ఉప ముఖ్యమంత్రి కోసం ఏపీ సచివాలయంలో ఛాంబర్ సైతం సిద్ధం చేశారట అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేషీకి దగ్గరలోనే పవన్ ఛాంబర్‌ను కేటాయించినట్లుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సెకండ్ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్న 212 నెంబర్ గదిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. జనసేన నుంచి మంత్రులుగా స్థానం దక్కించుకున్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌ల ఛాంబర్లు కూడా ఆ బ్లాకులోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

power star fans and janasena activists happy for AP Govt allocates room no 212 in secretariat for Dy cm pawan kalyan Check Details Here

ఈ నేపథ్యంలో 212 నెంబర్‌పై అందరి ఫోకస్ నెలకొంది. ఇక జనసైనికులు, పవన్ అభిమానులైతే కొత్త వాదనను తెరమీదకి తీసుకొస్తున్నారు. 212 నెంబర్ తమ అధినేతకు బాగా కలిసొచ్చిందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలవగా, లోక్‌సభ ఎన్నికల్లో 2 ఎంపీ సీట్లను జనసేన సొంతం చేసుకుంది. ఈ నెంబర్లను విడి విడిగా రాస్తే 21, 2 అదే కలిపి రాస్తే 212. ఇప్పుడు పవన్ ఛాంబర్‌ ఉన్న రూమ్ నెంబర్ కూడా 212 కావడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేతగా సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎంగానూ సత్తా చాటుతారని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఈ 212 నెంబర్ యాధృచ్ఛికంగా వచ్చిందా లేక పవన్, జనసేన పార్టీ సూచన మేరకు ఆ నెంబర్ కేటాయించారా అన్నది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X