ప్రకాష్ రాజ్ డబుల్ స్టాండర్డ్స్.. పవన్ టార్గెట్ చేసి.. ఆ హీరోను ఎందుకు వదిలేశాడు?
ఎలాంటి సందేహం లేకుండా ఇండియన్ సినిమాకి దొరికిన కొందరు గాడ్ గిఫ్టెడ్ నటుల్లో వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒకరని చెప్పొచ్చు. ఎన్నో భాషలపై తనకి ఉన్న పట్టు ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్ మన తెలుగు ఆడియెన్స్ కి కూడా ఎంతో సుపరిచితులు.. కాగా ఎక్కువగా నెగిటివ్ పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్ ప్రస్తుతం సినిమాలు సహా పరోక్షంగా రాజకీయ విషయాల్లో కూడా చాలా చురుకుగా కనిపిస్తున్నారు.
కాగా ఇటీవల మాత్రం ప్రకాష్ రాజ్ మాటలు కోటలు దాటుతున్నాయని తెలుగు ఆడియెన్స్ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే నేను సెక్యులర్ ని అంటూ ప్రకాష్ రాజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వరుసగా సోషల్ మీడియాలో మాటల తూటాలతో దాడి చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగిన అపరాధంపై పవన్ చేసిన వ్యాఖ్యలకి గాను ప్రకాష్ రాజ్ చేసిన పలు షాకింగ్ కామెంట్స్ బాగా చర్చకి దారి తీశాయి.

పవన్ ముందు ఒకలా గెలిచాక ఒకలా మారిపోయారు అని తప్పు చేయకపోయినా సారీ చెప్పించుకున్నాడు. ఆ తర్వాత మరిన్ని సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ పవన్ సనాతన ధర్మం విషయంలో చేసిన కామెంట్స్ కి నార్త్ జనం సైతం పవన్ ఇచ్చిన సనాతన ధర్మ రక్షణ బోర్డు ఇతర కామెంట్స్ కి ఏకీభవించారు. ఇంకా చెప్పాలంటే పవన్ వల్ల మళ్ళీ ధర్మం కోసం చాలామంది మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారని అంటున్నారు.
మరి అలాంటి పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్న ప్రకాష్ రాజ్ కి అటు తమిళనాట ప్రముఖ హీరో రాజకీయ నాయకుడు కూడా అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ని ఎందుకు ప్రశనించలేదు అనే విమర్శలు ప్రకాష్ రాజ్ పై వస్తున్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అని పవన్ కళ్యాణ్ మీడియా ముందు గట్టిగా చెప్పడమే తప్పుడు స్టేట్మెంట్ అన్నట్టుగా ప్రకాష్ రాజ్ సహా చాలా మంది పవన్ పై విమర్శలు చేస్తున్నారు..
కానీ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అనేది ఒక రోగం లాంటిది అని చెప్పినపుడు ఇప్పుడు సదరు పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తున్న ప్రకాష్ రాజ్ సహా మిగతా అంతా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. అలాంటి అభ్యంతరకర స్టేట్మెంట్స్ విషయంలో ఎందుకు ప్రకాష్ రాజ్ నోరు మెదపలేదని అంటున్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ పై గట్టి కౌంటర్ కూడా వేశారు. ఇక్కడ హిందువుల మనోభావాల కోసం మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ మొన్న బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల జరిగిన ఊచకోతపై ఎందుకు మాట్లాడలేదని అది కలిగించింది అని పవన్ క్రేజీ కౌంటర్ ప్రకాష్ రాజ్ పై వేయడం నార్త్ ఆడియెన్స్ లో కూడా బాగా రీచ్ అయ్యింది. దీనితో ప్రకాష్ రాజ్ డబుల్ స్టాండర్డ్స్ గేమ్స్ ఆడుతున్నాడని క్లియర్ గా కనిపిస్తున్నట్టుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ కాంట్రవర్సీలు అన్నిటికి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











