పవన్ తో ప్రకాష్ రాజ్ వార్.. ఏకేస్తున్న నెటిజన్స్
ఇప్పుడు ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న టాలీవుడ్ హీరో కానీ పొలిటీషియన్ పేరు కానీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. కాగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా ఎంత సీరియస్ గా ఉంటారో అనేది ఇప్పటికే చాలా మందికి తెలుసు.
అయితే కొన్ని కొన్ని సార్లు పవన్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ కూడా వస్తుంది కానీ పవన్ కి తన అభిమానులే డిఫెండ్ చేసేవారిగా సోషల్ మీడియాలో నిలుస్తారు. కాగా ఇప్పుడు పవన్ విషయంలో అంశాలు చాలా సీరియస్ గా మారుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులు నుంచి జాతీయ స్థాయిలో పెద్ద కాంట్రవర్సీ రేపుతున్న తిరుపతి లడ్డు విషయంలో పవన్ తన తోటి ఇండస్ట్రీ హీరోస్ ని సైతం వదలలేదు.

కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు కాంట్రవర్సీ హీరో కార్తీ తిరుమల లడ్డు విషయంలో నవ్వుతు సమాధానం ఇస్తేనే పవన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. దీనితో పవన్ మీదనే విమర్శలు చేసిన వాళ్ళు చాలా మంది కనిపించారు. తాను చేయని తప్పుకు కార్తీ క్షమించమని కోరాడు అని పవన్ ఇలాంటివి తగ్గించుకోవాలని సదరు నెటిజన్స్ కొందరు ఉచిత సలహాలు పవన్ కి అందిస్తున్నారు.
అయితే దీనిని మాత్రం పవన్ సహా హిందూ మతవాదులు ఖండిస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో హిందువులకి ఐకమత్యం లేదు, ఇదే తరహాలో ఇతర మతాల్లో చేస్తే వాళ్ళు అంతా ఒకటవుతారు కానీ మన హిందువులలోనే ఎక్కడ లేని సలహాలు ఇచ్చేవాళ్ళు హిందూ మతాన్ని అపహాస్యం చేస్తున్నా కూడా ఎక్కువ కనిపిస్తారు అంటూ చాలా మంది పవన్ రియాక్షన్ కి సపోర్ట్ గా నిలిచారు.
సరే ఈ కాంట్రవర్సీలోనే వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ పై కూడా పవన్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. దీనికి పవన్ పై మళ్ళీ ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా ఓ వీడియో చేయడంతో ఒకొకటి అంతకు మించి వెళుతుంది. తాజాగా సెటిల్ అయ్యిపోయిన కార్తీ విషయంలో పవన్ ని టార్గెట్ చేస్తూ చేయని తప్పుకు కూడా క్షమాపణలు చెప్పించుకుంటున్నారు అంటూ పవన్ పేరు లేకుండా ట్రిగ్గర్ చేసే పోస్టులు ప్రకాష్ రాజ్ చేయడం వైరల్ గా మారింది.

దీనితో చిర్రెత్తుకొచ్చిన పవన్ అభిమానులు సహా హిందూ మతం విషయంలో పవన్ తో నిలబడిన నెటిజన్స్ ప్రకాష్ రాజ్ ని ఏకేస్తున్నారు. పవన్ మూలాన ఇప్పుడే కొద్దో గొప్పో హిందువుల్లో చలనం వస్తుంది అని ఇలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ చేస్తున్న పోస్ట్స్ పై పవన్ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మరి ఇదంతా చూస్తుంటే పవన్ విషయంలో ప్రకాష్ రాజ్ కావాలనే సాగదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రకాష్ రాజ్ విషయంలో కౌంటర్ ఇస్తారో లేక పట్టించుకోకుండా వదిలేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











