టాలీవుడ్ ఆదాయం ఏపీకి సగం.. చంద్రబాబు మైండ్‌లో అదే: స్టార్ ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆత్మీయుడిగా భావించే చంద్రబాబు సీఎం కాగా.. స్వయంగా సినీ రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఏపీలో సినీ రంగం అభివృద్ధి, సినీ నటుల సంక్షేమంపై కీలక అడుగులు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం కోసం ముందుకు రావాలని ఇప్పటికే ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం పలికారు.

విస్తారమైన సముద్ర తీరం.. కోనసీమ అందాలు, చారిత్రక , పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన ప్రదేశాలు ఏపీలో బోలెడు. అన్నింటికి మించి టాలీవుడ్ మొత్తం ఇష్టపడే విశాఖపట్నం రెడీమేడ్‌గా అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉంది. ఇప్పటికే అక్కడ రామానాయుడు స్టూడియోలో సినిమా తీయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి. విశాఖలో కానీ , అమరావతిలో కానీ స్టూడియోలు, ఇతర సినీ అనుబంధ పరిశ్రమల స్థాపన నిమిత్తం భూములు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఎప్పుడో సంసిద్ధతను వ్యక్తం చేసింది.

producer ks rama rao made sensational comments on Tollywood shifting to ap here s the details

ఏపీకి చిత్ర పరిశ్రమ తరలింపు, అభివృద్ధిపై తరచుగా మేధావులు, సీనియర్ నటులు కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. మొన్నామధ్య సుమన్ అమరావతికి వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో చిన్న సినిమాలు ఆడాలంటే లొకేషన్లు కూడా బాగుండాలన్నారు. చిన్న సినిమా బతకాలంటే ఏపీలో ఫిలిం సిటీ మాదిరిగా చిన్న చిన్న సెట్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఆయన సూచించారు.

తాజాగా చంద్రబాబుకు వీర విధేయుడు , సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు కూడా ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై కీలకవ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఏపీ నుంచి టాలీవుడ్‌కు 60 శాతం ఆదాయం వస్తుందన్నారు. సినిమా తప్పించి ఆంధ్ర వాళ్లకి వేరే ఎంటర్‌టైన్‌మెంట్ లేదని , ఇండస్ట్రీ అంతా ఉన్నది తెలంగాణలో, ఆదాయం ఖర్చు చేసేది హైదరాబాద్‌లో అని కేఎస్ రామారావు తెలిపారు. ఇందులో 50 శాతమైనా ఏపీలో ఖర్చు పెట్టాలని.. సినిమా మేకింగ్ అనేది అక్కడ పెరగాలన్నారు.

producer ks rama rao made sensational comments on Tollywood shifting to ap here s the details

ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, స్టూడియోల నిర్మాణానికి స్పెషల్ పాలసీ ఉండాలని రామారావు సూచించారు. ఇన్‌ఫ్రా డెవలప్‌ కావాలంటే సినీ రంగానికి చెందిన నిపుణుల సేవలను వినియోగించుకోవాలన్నారు. అలా ఆలోచించే ఒకప్పుడు మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు ఇండస్ట్రీ తరలివచ్చిందని కేఎస్ రామారావు గుర్తుచేశారు.

ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా రాజధానుల్లోనే సినీ పరిశ్రమ ఉందని , ఏపీలోనూ అమరావతిలోనే ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రయారిటీస్‌లో రాజధాని అమరావతి, పోలవరం, రైతులు, విద్యార్ధులు ఉన్నారని వాటి తర్వాతే సినీ పరిశ్రమ అని కేఎస్ రామారావు తెలిపారు. కా

నీ చంద్రబాబు మైండ్‌లో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి కూడా ఉండే ఉంటుందన్నారు. ప్రస్తుతం రామారావు వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కేఎస్ వ్యాఖ్యలకు టాలీవుడ్ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తుందా అనే వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X